SBI to stop ATM money withdrawal without OTP ఎస్బీఐ ఏటీయం నుంచి డబ్బులు కావాలా.. ఓటీపీ ఎంటర్ చేయాలా.!

Sbi to launch otp based atm cash withdrawal from january 1

SBI, State Bank of India, OTP, SBI OTP, ATM, Cash transactions, OTP-based ATM Withdrawal, Banking, Personal Finance, Personal Finance, Personal Finance News, Business

SBI ATM alert: With an aim to minimize the number of unauthorized transactions, State Bank of India announced the launch of OTP-based ATM Withdrawal system for transactions above Rs 10,000 between 8 PM to 8 AM.

ఎస్బీఐ న్యూఇయర్ కానుక: డబ్బులు కావాలా.. ఓటీపీ ఎంటర్ చేయాలా.!

Posted: 12/27/2019 05:39 PM IST
Sbi to launch otp based atm cash withdrawal from january 1

ఏటీఎం మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) నడుం బిగించింది. తమ బ్యాంకు ఖాతాదారులతో పాటు డబ్బు విత్ డ్రా చేసే ఖాతాదారుల భద్రత ఎంతో ముఖ్యమని జాగ్రత్త చర్యలకు పూనుకుంది. జనవరి 1 మొదలు ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలలో డబ్బు డ్రా చేస్తే.. ముందుగా ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే తప్ప ఖాతాదారులకు డబ్బులు విత్ డ్రా కావు.

జనవరి 1 నుంచి మీరు ఎస్బీఐ ఏటీయం కేంద్రాల నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. అంటే బ్యాంకు ఖాతాతో లింక్ అయ్యి వున్న సెల్ ఫోన్ ను వెంటబెట్టుకుని వెళ్లాల్సిందే. రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.

ఎస్బీఐ వినియోగదారులు ఏటీఎంలో నిర్దేశించిన సమయంలో నగదు విత్‌ డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు స్క్రీన్ పై ఓటీపీ అడుగుతుంది. వారి రిజిస్టర్‌ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ జరపొచ్చు. ఓటీపీ ద్వారా కేవలం ఒక్క లావాదేవీ మాత్రమే చేయొచ్చని ఎస్బీఐ తెలిపింది. దీనివల్ల అనధికార లావాదేవీలను నివారించొచ్చని పేర్కొంది. ఎస్బీఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో గానీ, ఇతర బ్యాంకు కార్డు వినియోగదారులు ఎస్బీఐ ఏటీఎంల్లో గానీ ఈ సదుపాయాన్ని పొందలేరు.

ఈ మార్పు చేయడానికి ఏటీఎంల్లో పెద్ద మార్పులేమీ అవసరలేదని, జనవరి 1 నుంచి ఓటీపీ విధానం తీసుకొస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా ఏటీఎం కేంద్రాల్లో క్లోనింగ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చెక్‌ పెట్టేందుకు వీలవుతుంది. అయితే గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ, నగరాల్లోని పేదలు డబ్బును విత్ డ్రా చేయాలంటే మాత్రం కొంత ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. ఇక నిర్జన ప్రాంతంలోని ఏటీయం కేంద్రాలతో పాటు.. రాత్రి వేళల్లో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసేవారిని రక్షణగా ఒక సిసిటీవీవి ఏటీయం కేంద్రాల బయట కూడా పెటాల్సిన అవసరం వుందని ఖాతాదారులు కొరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles