AP cabinet meet details revealed హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం

Ycp minister perni nani reveals ap cabinet meeting details

YS Jagan, Cabinet Meet, Perni Nani, Kanna Babu, Capitals, Amaravati protesters, Dhulipala Narendra, Devineni Uma, Amaravati Bandh, !44 Section, Police forces beefedup, mandadam villagers, Tension at Amaravati Farmers protest, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

AP Minister Perni Nani addressed a media conference and said the government will take the decision on capital after reviewing the Boston committee report, which will be handed over on 3 January 2020.

ITEMVIDEOS: హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం

Posted: 12/27/2019 03:56 PM IST
Ycp minister perni nani reveals ap cabinet meeting details

మూడు రాజధానుల ప్రతిపాదనలపై యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న క్రమంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ అంశంమై సుదీర్ఘచర్చకు తెరలేపిందని.. ఈ అంశంలో కీలక నిర్ణక్ష్ం కూడా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని క్యాబినెట్ సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తూ తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ది, రాజధాని ఏర్పాటు విషయంలో హైపవర్ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని, ఈ కమిటీ గతంలోని శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన అద్యాయనాలను కూడా పరిశీలించి.. పరిగణలోకి తీసుకుని తమ నివేదికను అందించిందని మంత్రి తెలిపారు.

ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి పోందిన మహానగర నిర్మాణాల అనుభవం కలిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బిసిజీ) నివేదిక అందించిన కూడా జనవరి తొలివారంలో క్యాబినెట్ ముందుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటిపై మంత్రులు, సీనియర్ ఐఏఏస్ అధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయనునన్నామని తెలిపారు. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసిన తరువాత హైపవర్ కమిటీ అందించే నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రకటన చేస్తుందని మంత్రి తెలిపారు.

దీంతో పాటు కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. కొత్తగా 108 వాహనాల కొనుగోలుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని.. 412 వాహనాల కొనుగోలుకు రూ.78 కోట్లు కేటాయించేందకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలకు మద్దతు ధర ముందే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వీలుగా కృష్ణపట్నం పోర్టు ముఖద్వారం కుదించనున్నట్లు తెలిపారు.

రాజధాని నిర్మాణంలో జరిగిన అక్రమాలను ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించిందని.. వాటిపై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈ వ్యవహారాన్ని లోకాయుక్త, సీబీఐ, సీబీసీఐడీల్లో దేనికి అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంత్రి నారాయణ కమిటీ నివేదిక ఆధారంగా మొత్తంగా 52 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. అయితే ఇందుకు రూ.లక్షా 9వేల కోట్ల పెట్టుబడులు అవసరమని భావించి కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సంక్షేమం కూడా ముఖ్యమని భావించే ప్రభుత్వం తమదని అందకనే జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ వేసి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles