Amaravati farmers protests demanding one capital అమరావతి గ్రామాల్లో ఏడో రోజు కొనసాగుతున్న అందోళనలు

Farmers protests demanding to continue amaravati as capital

YS Jagan, Capitals, Amaravati protesters, Amaravati Bandh, !44 Section, Police forces beefedup, mandadam villagers, Tension at Amaravati Farmers protest, Amaravati farmers indefinate fast, Amaravati, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Andhra Pradesh, Politics

The agitation on the nave of saving Amaravati has continued on Tuesday. The Farmer holds protests on road leading to Amaravati and launched a program called Vanta-Varpu cooking food on the road to mount pressure on the government to continue capital at Amaravati.

అమరావతి గ్రామాల్లో ఏడో రోజు కొనసాగుతున్న అందోళనలు

Posted: 12/24/2019 12:09 PM IST
Farmers protests demanding to continue amaravati as capital

ఆంధ్రప్రద్రేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం రోజురోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతుంది. అమరావతి రైతులు త్యాగాన్ని గుర్తించి.. దీనినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని రైతులు ర్యాలీలు, నిరసనలు ఇవాళ్టికి ఏడో రోజుకు చేరకున్నాయి. అమరావతిని ఎమ్మెల్యేలు, అధికారుల హనీమూన్ స్పాట్ గా మార్చవద్దని.. ఇక్కడే సెక్రటేరియట్, హైకోర్టులను ఏర్పాటు చేయాలని నినదిస్తూ రాజధాని గ్రామాల ప్రజలు అందోళనలు చేపడుతున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.

అమరావతి రైతుల ఆందోళనకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. దీంతో అందోళన కార్యక్రమాలు ఉదృతం అవుతున్నాయి. మందడం వద్ద నిరసన చేపట్టేందుకు రైతులు ఇవాళ కూడా సిద్ధమయ్యారు. రోడ్డుకు అడ్డంగా టెంటు వేసి ఆందోళన చేస్తున్నారు. దీంతో సచివాలయానికి రాకపోకలు నిలిచాయి. అర్ధనగ్న ప్రదర్శనతో రైతులు నిరసన తెలుపుతున్నారు. రాజధాని పోరు నేపథ్యంలో మందడం, మల్కాపురం జంక్షన్‌ వద్ద భారాగా పోలీసులను మోహరించారు.

తుళ్లూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. నిరసన దీక్షలు చేపట్టేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు అటు వెళ్లగానే రైతులు టెంట్లు వేసుకుని తమ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రాజధానికి వెళ్లే రోడ్డుపై కాకుండా మరో రోడ్డుపై తమ నిరసన వ్యక్తం చేయాలని పోలీసులు వాదించగా, తాము రోడ్డుపై టెంట్లు వేయడం లేదని, రోడ్డు పక్కన వేసుకుంటున్నామని రైతులు వాదించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతుండగా, న్యాయవాదులంతా చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. న్యాయవాదులు పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతివాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే అటువైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించేవారితో పాటు కొత్తవారిని అమరావతి వైపు రానీయకుండా ముందస్తు భద్రతాచర్యలు చేపడుతున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసుల నిర్బంధాలేంటని స్థానికులు పోలీసులపై మండిపడుతున్నారు.  

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరావతి పరిసరాల్లోని అత్కూరుకు వస్తున్న తరుణంలో ఆయనను కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకునేందుకు రైతలు సిద్దం అవుతున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసేందుకు కూడా రాజధాని రైతులు అపాయింట్ మెంట్ కోరారు. మరోవైపు ‘ సేవ్ అమరావతి’ పేరిట సిద్దార్థ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles