AIIMS team conducts fresh autopsy of Disha Case accused‘దిశ’ నిందితుల మృతదేహాలకు కుటుంబసభ్యులకు అప్పగింత

Disha case aiims team conducts fresh autopsy of accused killed in encounter

Disha, veterinary doctor, veterinary disha, disha case parents, disha parents encounter, disha case accused, cyberabad police, commissioner Sajjanar, mohammad arif, Siva, Navin, Chennakeshavulu, National Human Rights Commission, minors in disha case, minors encounter, NHRC, crimes against women, Telangana, Crime

A team of doctors from the All India Institute of Medical Sciences (AIIMS) in New Delhi, visited the state-run Gandhi Hospital in Hyderabad on Monday, and conducted the second autopsy on the bodies of four men accused in the Disha rape and murder case.

‘దిశ’ నిందితుల మృతదేహాలకు కుటుంబసభ్యులకు అప్పగింత

Posted: 12/23/2019 05:47 PM IST
Disha case aiims team conducts fresh autopsy of accused killed in encounter

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులోని నిందితుల మృతదేహాలకు ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్స్ నిపుణుల బృందం శాస్త్రీయ పద్దతిలో పోస్టుమార్టం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలు మేరకు నిపుణులు పూర్తి పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించిన వీడియోను చిత్రీకరించారు. న్యాయస్థానం అదేశాలతో రీపోస్టుమార్టం పూర్తైన తరువాత నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తరువాత వారి స్వస్థలాలకు మృతదేహాలను తీసుకువెళ్లిన పోలీసులు.. ఈ ఎన్ కౌంటర్ పై అనుమానాలు వున్నాయంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు కావడంతో న్యాయస్థానం అదేశాలమేరకు నాలుగు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే భద్రపర్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్య నిపుణులు  గాంధీ ఆసుపత్రిలో రీపోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. అంతకుముందు మృతదేహాలకు ఎక్స్ రే తీశారు. కాగా, నివేదిక వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టులో సమర్పించనున్నారు.  

అనంతరం నాలుగు మృతదేహాలను వారి కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. రెండు అంబులెన్స్ లలో మృతదేహాలను వారి గ్రామాలకు తరలించారు. ఈరోజే మృతదేహాలకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మృతుల కుటుంబీకుల సమక్షంలోనే ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టంను నిర్వహించారు. ఎయిమ్స్ బృందమే ఈ వీడియో చిత్రీకరణ జరిపినట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. మరో రెండు రోజుల్లో రీపోస్టుమార్టం రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు హైకోర్టుకు అందించనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha  veterinary doctor  encounter  gangrape case  mohammad arif  Siva  Navin  Chennakeshavulu  Shamshabad  Telangana  Crime  

Other Articles