MLA Sengar Jailed for Life in Unnao Rape Case ఉన్నావ్ అత్యాచార కేసు: దోషైన ఎమ్మెల్యేకు జీవిత ఖైదు.!

Expelled bjp mla sengar jailed for life in unnao rape case

cbi, Kuldeep Singh Sengar, posco, Rape, unnao, Unnao rape case, Uttar Pradesh, Crime

A Delhi court on Friday sentenced expelled BJP MLA Kuldeep Singh Sengar to life imprisonment following his conviction in the 2017 Unnao rape case. District Judge Dharmesh Sharma also imposed an exemplary fine of Rs 25 lakh in the case and has to be paid within a month.

ఉన్నావ్ అత్యాచార కేసు: దోషైన ఎమ్మెల్యేకు జీవిత ఖైదు.!

Posted: 12/20/2019 05:55 PM IST
Expelled bjp mla sengar jailed for life in unnao rape case

ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిగా తేలిన భాజపా మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌కు శిక్ష ఖరారైంది. సెంగార్‌కు జీవితఖైదు విధిస్తూ దిల్లీలోని తీస్‌ హజారీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం, విచారణ ఖర్చుల నిమిత్తం రూ.15లక్షలు చెల్లించాలని కోర్టు సెంగార్‌ను ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి సెంగార్‌ నుంచి ఏమైనా ముప్పు ఉందేమో సమీక్షించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబానికి సురక్షితమైన నివాసం కల్పించే బాధ్యతను కూడా న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. 

ఉద్యోగం కావాలంటూ వెళ్లిన 17 ఏళ్ల మైనర్‌ బాలికపై 2017 జూన్‌ 4 భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ అత్యాచారం చేసినట్టు ఆరోపణ వచ్చింది. 2018 ఏప్రిల్‌ 3న బాధితురాలి తండ్రిపై కొందరు వ్యక్తులుదాడి చేయడంతో పాటు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై తప్పుడు కేసులో ఇరికించారు. సెంగార్‌పై కేసులు నమోదు చేయకపోవడంతో ఏప్రిల్‌ 8న ఆమె, కుటుంబ సభ్యులతో లఖ్‌నవూ వెళ్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరుసటి రోజునే పోలీసు కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి మరణించాడు. చివరకు ఏప్రిల్‌ 13న సెంగార్‌ను అరెస్టు చేశారు. జులై 28న విచారణ నిమిత్తం బాధితురాలు కారులో కోర్టుకు వెళ్తుండగా, నంబరులేని లారీ దాన్ని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బాధితురాలికి బంధువులైన ఇద్దరు మహిళలు మృతి చెందగా, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cbi  Kuldeep Singh Sengar  posco  Rape  unnao  Unnao rape case  Uttar Pradesh  Crime  

Other Articles