Can give Musharraf citizenship, says Subramanian Swamy ‘‘ముషరఫ్ కి ఫాస్ట్ ట్రాక్ పద్దతిన భారత పౌరసత్వం’’

Musharraf from daryaganj can give him fast track citizenship says subramanian swamy

subramanian swamy, pervez musharraf, subramanian swamy caa, citizenship amendment act, caa news, caa latest news, musharraf daryaganj house, musharraf india connection, musharraf death sentence, Politics

Amid nationwide stir over the amended Citizenship Act, BJP MP Subramanian Swamy has made a statement which could trigger a fresh debate. He said that former Pakistan President General Pervez Musharraf can be given Indian citizenship “on a fast track basis as he belongs to Delhi’s Daryaganj”.

‘‘ముషరఫ్ కి ఫాస్ట్ ట్రాక్ పద్దతిన భారత పౌరసత్వం’’

Posted: 12/19/2019 09:19 PM IST
Musharraf from daryaganj can give him fast track citizenship says subramanian swamy

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ.. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు భారత పౌరసత్వం ఇస్తామన్నారు. పాకిస్థాన్ కోర్టు ఆయనకు ఇటీవలే మరణ శిక్ష విధించిన నేపథ్యంలో.. సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీంతో పాటు ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడిగా కొనసాగిన క్రమంలో భారత్ పై కఠినంగానే వ్యవహరించినా.. ఆయనకు స్నేహహస్తాన్ని అందిస్తామని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేయడం పలువున్ని విస్మయానికి గురిచేస్తోంది.

ముషారఫ్ 1943లో పాత ఢిల్లీలోని దర్యాగంజ్‌లో పుట్టారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. ‘‘దర్యాగంజ్‌లో జన్మించిన ముషారఫ్ ప్రస్తుతం పీడనకు గురవుతున్నారు. ఆయనకు ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వం ఇవ్వగలం. హిందువుల సంతతి వారెవరైనా కొత్త పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం దీనికి అర్హులే’’ అని స్వామి ట్వీట్ చేశారు. 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి.. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు గానూ పాకిస్థాన్ స్పెషల్ కోర్టు ముషారఫ్‌కు మరణ శిక్ష విధించింది.

కానీ ఈ తీర్పు పట్ల పాకిస్థాన్ సైన్యం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆయన సౌదీలో చికిత్స పొందుతున్నారు? కార్గిల్ యుద్ధానికి వ్యూహరచన చేసిన పర్వేజ్ ముషారఫ్‌.. భారత పౌరసత్వ కోరతారని భావించలేం. కానీ ఆయనకు పౌరసత్వం ఇస్తామనడం ద్వారా భారత్ గొప్పదనాన్ని చాటడంతోపాటు.. పౌరసత్వ చట్టం ద్వారా ముస్లింల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న విపక్షాల ఆందోళనకు చెక్ పెట్టొచ్చనేది స్వామి వ్యూహంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles