3 students from Telangana drown in waterfalls వాటర్ ఫాల్స్ లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు గల్లంతు

Maharashtra three telangana students drown in waterfall at trimbakeshwar

Chhatrapati Shahu Maharaj, Agriculture college, Kanchanwadi, Durgawadi water falls, Trimbakeshwar, Nashik, Maharashtra, Waterfall, Telangana, Crime

Three students hailing from Telangana drown at Durgawadi water in Trimbakeshwar in Nashik district. They were identified as Anusha, Koti Reddy and Raghuvamshi. The trio along with three other students from Chhatrapati Shahu Maharaj Shikshan Sanstha's College of Agriculture college in Aurangabad had come to Trimbakeshwar on a bike expedition.

వాటర్ ఫాల్స్ లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు గల్లంతు

Posted: 12/19/2019 11:28 AM IST
Maharashtra three telangana students drown in waterfall at trimbakeshwar

వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తలుగా మారి దేశానికి సేవా చేయాల్సిన ముగ్గురు విద్యార్థులు. వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్లి గల్లంతయ్యారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు అక్కడి మరికోందరు తెలంగాణ విద్యార్థులతో కలసి బైక్ లపై పర్యాటక స్థలాల సందర్శనకు వెళ్లారు. ఆరు మందిలో ముగ్గురు వాటర్ ఫాల్స్ తో దిగి నడచుకుంటూ కొంత దూరం వెళ్లి.. ఆ తరువాత గల్లంతయ్యారు. దీంతో వారి కోసం రంగంలోకి దిగిన పోలీసులు, గజఈతగాళ్లు.. గల్లంతైన విద్యార్థుల కోసం అన్వేషించి వారి మృతదేహాలను కనుగొన్నారు.

ఈ ఘటన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో ఉన్న దుర్గావాడీ వాటర్‌ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. ఔరంగాబాద్ సమీపంలోని కంచన్ వాడీలోని ఛత్రపతి సాహు మహరాజ్ శిక్షన్ సంస్థాన్ అగ్రికల్చర్ వర్సిటీలో చదువుతున్న ఆరు మంది తెలంగాణ విద్యార్థులు కలసి వాటర్‌ఫాల్స్ చూడ్డానికి వెళ్లారు. అందులో.. అనూష(21), రఘువంశీ(21), కోటి రెడ్డి (20), గిరిధర్ ఆకాశ్(20), వెంకటేశ్వర్ రెడ్డి(20) కావ్య(20) ఉన్నారు. వీరంతా తమ కాలేజీ నుంచి బైక్ లపై దుర్గావాడీ వాటర్ పాల్స్ వెళ్లారు. వాటర్ ఫాల్స్ లో కొంత సేపు గడిపిన తరువాత.. కాగా అనూష, రఘువంశీ, కోటి రెడ్డి నీళ్లలోకి వాటార్ ఫాల్స్ నడుచుకుంటూ వెళ్తామని చెప్పారు.

దీంతో గిరిధర్ అకాశ్, వెంకటేశ్వర్ రెడ్డి, కావ్యలు తాము దిగిన హోటల్ గదికి వెళ్లారు. అయితే సాయంత్రమయినా ఇంకా తమ స్నేహితులు హోటల్ గదికి రాకపోవడంతో.. అందోళన చెందిన కావ్య, వెంకటేశ్వర్ రెడ్డి, అకాశ్ లు వారిని ఫోన్ చేశారు. స్థానికులు సాయంతో వారిని అన్వేషించారు. అయినా లాభం లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేయగా.. వారు గల్లంతైన వారికోసం అన్వేషణ ప్రారంభించగా, దుర్గావాడీ ఫాల్స్ లో నీరు లేకపోయినా.. ఒక చోట మాత్రం నీళ్లు లోతుగా వుండటంతో అందులో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

తొలుత అనూష మృతదేహం నీటిపై తేలుతూ కనిపించగా, ఆ తరువాత సాయంత్రం ఐదు గంటల సమయంలో మిగిలిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ రోజు ఉదయానికి మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై త్రయంబకేశ్వర్ తహసీల్దార్ దీపక్ గిరాసే మాట్లాడుతూ.. కోటి రెడ్డి ఇప్పటికే రెండు పర్యాయాలు త్రయంబకేశ్వర్ వాటర్ ఫాల్స్ కు వచ్చాడని, అతనే ఈ సారి కూడా తన ఇద్దరు స్నేహితులను సురక్షితంగా తీసుకువస్తాడని అభావించామని.. కానీ ఇలా అనూహ్య ఘటన చోటుచేసుకుంటుందని అనుకోలేదని అవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles