BJP Expelled MLA convicted in Unnao rape case ఉన్నావ్ రేప్ కేసులో.. ఆ ‘బీజేపీ’ ఎమ్మెల్యేనే దోషి.!

Bjp expelled mla convicted in unnao rape case

Kuldeep Singh Sengar, Unnao rape, Unnao, Kuldeep sengar, BJP MLA, BJP Expelled MLA, Tis Hazari court, Delhi, Lucknow, Supreme Court, Dharmesh Sharma, Uttar Pradesh, Crime

Expelled four-time BJP MLA Kuldeep Singh Sengar was today convicted of kidnapping and raping a young girl from Uttar Pradesh's Unnao district two years ago.

ఉన్నావ్ రేప్ కేసులో.. ఆ ‘బీజేపీ’ ఎమ్మెల్యేనే దోషి.!

Posted: 12/16/2019 05:46 PM IST
Bjp expelled mla convicted in unnao rape case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో.. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ సెంగార్ ను దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సోమవారం పది పేజీల తీర్పును వెలువరించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కేసును విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్‌ 376 (అత్యాచారం) కింద అతన్ని దోషిగా తేల్చింది. కాగా, ఈ నెల 19న కుల్దీప్ సింగ్ సెంగార్ కు శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ వెల్లడించారు.

నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన కుల్దీప్ సింగ్ సెంగార్.. నియోజకవర్గ పరిధిలో తనకు ఎదురులేదని, అంతా తన రాజ్యమేనని.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డటంతో న్యాయస్థానం.. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో కోర్టులో విచారణ సాగుతున్న ఈ కేసును న్యాయస్థానం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో ఆగస్టు 5 నుంచి ఈ కేసును రోజువారీగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ప్రస్తుతం కుల్దీప్ సింగ్ సెంగార్ తీహార్‌ జైలులో జుడీష్యియల్ రిమాండ్ అనుభవిస్తున్నాడు. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ ఓ బాలికను కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్‌ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. అయితే తనను ఎమ్మెల్యే అత్యాచారం చేశాడని అరోపించిన యువతి తండ్రిపై దొంగతనం కేసు మోపిన పోలీసులు అతడ్ని తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. దీంతో యువతి ఎమ్మెల్యే ఇంటికి ఎదురుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది.

దీంతో ఉన్నావ్ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేసిన న్యాయస్థానం కేసు విచారణను సీబిఐకి అప్పగించింది. సీబిఐ చార్జిషీటు దాఖలు చేసిన తరువాత ఈ కేసు విచారణను లక్నో కోర్టు నుంచి ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్‌ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ అభియోగాలు నమోదకు ముందు బాధితురాలిపై హత్యాయత్నం కూడా జరిగింది.

తమ న్యాయవాదితో పాటు తమ బంధువుల కారులో ప్రయాణిస్తున్న బాధితురాలని హతమార్చేందుకు కూడా కుట్రలు జరిగాయి. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీతో ఢీకొట్టించారు. అయితే అదృష్టవశాత్తు తీవ్రగాయాలపాలైన బాధితురాలు తృటిలో తప్పించుకుంది. కాగా, అమె బంధువులిద్దరు ఈ ఘటనలో చనిపోయారు. ట్రాక్టర్‌ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్ లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kuldeep Singh Sengar  Unnao rape  Kuldeep sengar  Tis Hazari court  Delhi  Lucknow  Uttar Pradesh  Crime  

Other Articles