Military camp in Niger attacked, 71 killed తెగబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు.. 71 మంది సైనికుల వీరమరణం

Attack on niger military base leaves 71 soldiers dead

tillaberi nigeria, nigeria soldiers killed, Nigeria Islamist, nigeria camp attack, Nigeria attack, africa, Niger military base, 71 soldiers dead, niger inates military base attack, 12 Army men wounded, ISIS Attack, Terrorists attack, massacre

ISIS has claimed responsibility for one of the deadliest attacks on Niger's military, which left 71 soldiers dead and 12 wounded. The attack happened when several hundred heavily armed militants ambushed soldiers at an outpost in Inates, in the west of the country near the Mali border, according to defense minister, Issoufou Katambe.

తెగబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు.. 71 మంది సైనికుల వీరమరణం

Posted: 12/13/2019 11:04 AM IST
Attack on niger military base leaves 71 soldiers dead

నైజర్ దేశంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు తెగబడ్డారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్మీ స్థావరంపై దాడి చేసిన వందలాది మంది ఐసిస్ ఉగ్రవాదులు 71 మంది సైనికులను పొట్టన బెట్టుకున్నారు. పశ్చిమ నైజర్ ప్రాంతంలోని ఇనేట్స్ మిలిటరీ బేస్ పై ఒక్కసారిగా చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు.. అకస్మాత్తుగా దాడి చేసి క్షణాల్లో 71 మంది సైనికులను బలితీసుకున్నారు. ఈ ఘటనలో మరో 12 మందికి సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు.

ఇనేట్స్ లోని పశ్చిమ తిల్లభేరి ప్రాంతంలో గల ఆర్మీ బేస్ క్యాంపుపైకి ఒక్క ఉదుటున విరుచుకుపడిన ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. 2015 నుంచి ఈ దేశాంలో ఇస్లామిక్ ఉగ్రవాదల ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగడం ఇదే తొలిసారి. ఈ దాడులలో 71 మంది సైనికులు మరణించారని ఆర్మీవర్గాలు విషాధాన్ని వ్యక్తం చేశాయి. వందలాది మంది ఉగ్రవాదులు, భారీ ఆయుదాలతో వచ్చి కాల్పులకు తెగబడ్డారని అయితే ఈ ఘటన నేపథ్యంలో నివ్వెరపోయిన ఆర్మీ వర్గాలు తెరుకుని ప్రతిదాడులకు పాల్పడ్డాయని.. ఉగ్రవాదుల్లో కూడా చాలా మందని హత్యమార్చాయని తెలిపాయి.

ఉగ్రవాదులతో మూడు గంటల పాటు ప్రతిదాడులు జరిగాయని చెప్పిన అధికారులు.. ఇంత భారీ సంఖ్యలో సైనికులు మరణించాడనికి ఉగ్రవాదులు మోటార్లు, షెల్స్ కూడా వినియోగించారని, దీనికి తోడు మందుగుండుతో పాటు ఇంధనాన్ని కూడా వాడారని తెలిపారు. ఇక ఉగ్రవాదులు ఓ వైపు ఆర్మీ దళాలపై ఆయుధాలతో పోరాడుతూనే అదే సమయంలో ఆత్మాహుతి దళాలను కూడా సైనికుల మీదకు ఉసిగోల్పారని దీంతోనే తీవ్ర ప్రాణనష్టం సంభవించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇస్తామిక్ స్టేట్ కు చెందిన బోకో హరామ్ ఉగ్రవాదులుతు, జీహాదీయులకు వ్యతిరేకంగా వాయువ్య ప్రాంతంలో నైజర్ దళాలు పోరాడుతున్నాయి.

ఈ దాడులతో ఘటనా స్థలిలో పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. ఎటు చూసినా మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. ప్రస్తుతం అక్కడ హై రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారన్న విషయమై ఆరా తీస్తున్నామని నైజర్ రక్షణ మంత్రి ఇసౌఫూ కటాంబే వ్యాఖ్యానించారు. కాగా ఈ దాడులకు తామే బాధ్యులమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రదాడులను ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఈ ఘోరకళిని ఖండించిన భారత్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఉద్యమించాలని పిలుపునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles