Pawan Kalyan begins his day's fast in Kakinada కాకినాలో జనసేన రైతు సాభాగ్య దీక్ష ప్రారంభం

Jana sena chief pawan kalyan begins his day s fast in kakinada

Pawan Kalyan, JanaSena, Nagababu, Nadendla Manohar, Pantam Nanaji, Rythu Soubhagya Deeksha, Kakinada, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Religion, caste, Chirstianity, HInduism, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

The Jana Sena chief Pawan Kalyan has initiated his one fast at JNTU in Kakinada in protest to government's incompetence of solving farmer's problems in the state. He began his fast 8 am. Pawan was accompanied by his brother Nagababu and Jana Sena leader Nadendla Manohar.

కాకినాలో జనసేన రైతు సాభాగ్య దీక్ష ప్రారంభం

Posted: 12/12/2019 11:51 AM IST
Jana sena chief pawan kalyan begins his day s fast in kakinada

రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన రైతు సౌభాగ్య దీక్ష, కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా వున్న ఖాళీ స్థలంలో ఈ ఉదయం ప్రారంభమైంది. పవన్ దీక్షలో ఆయన సోదరుడు నాగబాబుతో పాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ దీక్ష చేయనున్న పవన్, రైతుల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.

రాష్ట్రంలోని రైతులు పడుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను దీక్ష చేస్తున్నట్టు పవన్ ఇప్పటికే ప్రకటించారు. గిట్టుబాటు ధరలు లభించక, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కష్టాలను, ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం జగన్‌కు రైతుల సమస్యలు తెలియజేసేందుకే తాను దీక్ష చేపట్టానని పవన్ తెలిపిన విషయం తెలిసిందే. కాగా, వరి పంట వేయడానికి రైతులు భయపడుతున్నారని.. రాష్ట్రంలో పరిస్థితులు అంత దారుణంగా తయారయ్యాయని పవన్ విమర్శించారు. గిట్టుబాటు ధర లేక.. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిసరాల్లో తిరిగి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని.. వారి కష్టాలు, ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే జనసేన రైతు సౌభాగ్య దీక్ష చేపడుతున్నానని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బకాయిలు చెల్లించి మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.కాగా, జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీక్షకు రాపాక హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే తాను పవన్ దీక్షకు హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles