Justice loses character if it becomes revenge, CJI SA Bobde ప్రతీకార న్యాయంతో న్యాయవ్యవస్థకే ప్రమాదం: సీజేఐ

Justice loses character if it becomes revenge cji sa bobde

sa bobde, cji speech, cji bobde speech, cji speech rajasthan high court, rajasthan high court inauguration, sharad arvind bobde, hyderabad rape murder case, hyderabad encounter, hyderabad rape accused killed, hyderabad rape accused shot dead, Hyderabad, Telangana, Crime

Justice can never be instant and "loses its character as justice" if it becomes revenge, Chief Justice Sharad Arvind Bobde said Saturday at an event in Jodhpur. CJI remarks come after four young men accused of rape and murder were killed in Telangana.

ప్రతీకార న్యాయంతో న్యాయవ్యవస్థకే ప్రమాదం: సీజేఐ

Posted: 12/07/2019 03:51 PM IST
Justice loses character if it becomes revenge cji sa bobde

దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన క్రమంలో.. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలికి కూడా అలాంటి న్యాయాన్నే అందించాలని ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలావుండగా తమ బిడ్డలను.. అభం శుభం తెలియని పదకొండేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన కరుడగట్టిన నేరగాడు హాజీపూర్ శ్రీనివాస్ ను కూడా ఎన్ కౌంటర్ చేయాలని.. లేదా.. తమకు అప్పగించాలని హాజీపూర్ గ్రామస్థులు దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన నేపథ్యంలో మరోమారు డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు.

అయితే ఇలాంటి ఘటనల్లో సత్వర న్యాయం అందించాలన్న డిమాండ్ లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌంటర్ ను ప్రస్తావించకుండానే.. సత్వర న్యాయం అనేది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. జస్టిస్ అనేది ప్రతీకారం రూపంలో ఉండకూడదన్నారు. అలా జరిగితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో నేరంపై విచారణ జరగాలని.. అది లేకుండా ఎవరు దోషులో.. ఎవరు నిర్ధోషులే ఎలా పరిగణలోకి తీసుకుంటామాని అన్నారు.

రాజస్థాన్‌ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థగా న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూనే.. అప్పటికే ఉన్న సంస్థలను మరింత బలపరుస్తూ.. వేగవంతంగా, సంతృప్తికరంగా వివాదాల్లో రాజీ కుదర్చాలి లేదా పరిష్కారం చూపాలని సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ, వ్యాజ్యాలలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక వ్యాజ్యం పరిష్కారంలో ఎక్కువ సమయం తీసుకుంటే నేరానికి పాల్పడినట్టేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape case  Unnao  Hyderabad  CJI SA Bobde  Supreme court  Encounter  Punishment  Telangana police  Crime  

Other Articles