Pawan Kalyan Visits Tomato Market at Madanapally మతమార్పిడిలపై వున్న శ్రద్ద రైతులపై లేదా.?: పవన్ కల్యాణ్

Pawan kalyan visits tomato market at madanapally

Pawan Kalyan, JanaSena, madanapally, tomato market, peasents, farmers, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, Religion, caste, Chirstianity, HInduism, colourism, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena Party Chief, Pawan Kalyan visited Tomato market yard at madanapally along with party leaders Nadella Manohar and few others. He met farmers and came to know the problems of peasants.

మతమార్పిడిలపై వున్న శ్రద్ద రైతులపై లేదా.?: పవన్ కల్యాణ్

Posted: 12/05/2019 03:52 PM IST
Pawan kalyan visits tomato market at madanapally

దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. రైతుల తలరాత మాత్రం మారడం లేదని.. ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలానే వుంటే.. అన్నదాతలు రానున్న కాలంలో కనుమరుగు అవుతాడని అందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యవసాయం పండగ కాదు దండగా అని ఎందరో రైతన్నలు పట్టణాలకు వలసవచ్చి.. కూలీ పనులు చేసుకుని బతుకుబండిని సాగదీస్తున్నారని.. ఇప్పటికైనా అన్నదాతకు ఆపన్నహస్తం అందించకపోతే.. వారు మనజాలరని పవన్ అన్నారు.

రైతులు ఆరుగాల కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఈ సందర్భంగా పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ తీసుకువచ్చిందని అన్న ఆయన. ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకువస్తే.. ఇక్కడ ధరలు చూస్తే.. మార్కెట్లకు తరలించేందుకు అయిన ఖర్చులు కూడా రావడం లేదని రైతన్నలు అందోళన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాయలసీమలో జనసేన ‘ఆత్మీయ యాత్ర’లో భాగంగా చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న ఉల్లి మార్కెట్ లో పర్యటించిన ఆయన.. ఇవాళ టమాటా మార్కెట్ లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుంటానని అన్నారు. ఏ వైసీపీ ఎమ్మెల్యే అపుతారో చూస్తానని కూడా సవాల్ చేసిన ఆయన అన్నమాట ప్రకారం మదనపల్లిలోని టమాటా మార్కెట్ ను సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతన్నకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. రాష్ట్రంలో మతమార్పిడులపై ఉన్నంత శ్రద్ద రైతులపై ఎందుకు లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా రైతల గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆంగ్లమాధ్యమంపై అమలు చేయాలా వద్దా అన్న విషయంపై హడావిడి చేస్తున్న ప్రభుత్వం ముందుగా రైతన్న ఆక్రందనలను అర్థం చేసుకోవాలని సూచించారు. అన్నదాతలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. పుడమి తల్లిని నమ్ముకున్న పుత్రుల సమస్యలను పరిష్కారించాలని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. ఇసుక లేక పనులు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారు’ అని పవన్‌ వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  madanapally  tomato market  peasents  farmers  JanaSena  Andhra Pradesh  Politics  

Other Articles