Video of congress leader goes viral online నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న కాంగ్రెస్ నేత వీడియో.!

Congress leader mistakenly cheers for priyanka chopra instead of priyanka gandhi

congress mla surender kumar, priyanka chopra zindabad, priyanka gandhi vadra, delhi congress chief subhash chopra, social media, trending news, Viral video, New Delhi, politics

Slogan of ‘Sonia Gandhi zindabad! Congress party zindabad! Rahul Gandhi zindabad! Priyanka Chopra zindabad!’, instead of Priyanka Gandhi Vadra was mistakenly raised by Congress' Surender Kumar at a public rally in Delhi.

ITEMVIDEOS: నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న కాంగ్రెస్ నేత వీడియో.!

Posted: 12/02/2019 12:28 PM IST
Congress leader mistakenly cheers for priyanka chopra instead of priyanka gandhi

దేశరాజధాని న్యూఢిల్లీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఓ భారీ కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. న్యూఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత సుబాష్ చోప్రా నేతృత్వంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ ప్రసంగిస్తూ.. తన పార్టీకి, పార్టీ జాతీయ నేతలకు జిందాబాద్ లు కొడుతూ ఒక పెద్ద పోరబాటు చేశాడు. అంతే ఇప్పుడా వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఈ వీడియో అంతగా వైరల్ కావడానికి సురేంద్ర కుమార్ అనే ప్రస్తుత మాజీ.. గతంలో మూడు పర్యాయాల ఎమ్మెల్యేగా వ్యవహరించిన నాయకుడి చేసిన పనే. తన ప్రసంగం ముగించుకుని ఇక సెలవు అనబోయే ముందు ఆయన కార్యకర్తలతో నినాదాలు చేయించారు. ఈ సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబాష్ చోప్రా కూడా సురేంద్ర కుమార్ పక్కనే వుంటూ అతని చెప్పిన స్లోగన్లకు జై కోట్టారు. అంతే ఒక్కసారిగా ఆయన విస్మయం వ్యక్తం చేసి.. తేరుకుని వెంటనే సురేంద్ర కుమార్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు.

అసలు విషయం ఏమిటంటే.. సురేంద్ర కుమార్ నినాదాలు ఇస్తూ..  తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ... అనగానే, కార్యకర్తలు జిందాబాద్ అన్నారు. ఆపై కాంగ్రెస్ పార్టీ... అనగానే మరోసారి జిందాబాద్ కొట్టారు. రాహుల్ గాంధీ... అనగానే అదే స్పందన. ఇక ఆ తరువాత.. ప్రియాంకా గాంధీ... అనాల్సిన సురేంద్ర పొరపాటున ప్రియాంకా చోప్రా... అనేశారు. కార్యకర్తలు ఏ మాత్రం తడుముకోకుండా జిందాబాద్ చెప్పేశారు. సుబాష్ చోప్రా విస్మయం చెంది.. సురేంద్ర కుమార్ కు విషయాన్ని సర్థి చెప్పడంతో ఆయన క్షమాపణలు చెప్పి.. ప్రియాంకా గాంధీ పేరును చెప్పి కార్యకర్తలతో జై కోట్టించారు.

ఇక ఈ వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ముందురోజు రాత్రి ప్రియాంకా చోప్రా సినిమాను సురేంద్ర చూసివుంటారని అంటున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతకే అమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరు గుర్తు లేకపోవడం హేయకరమని కొందరు.. ప్రియాంకా చోప్రా కాంగ్రెస్ లో ఎప్పుడు మరికొందరు చేరారని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆయన పోరబాటు సహజమని సురేంద్రకుమార్ ను సమర్థిస్తున్నారు. నెట్టింట వైరల్ అయిన వీడియోను మీరూ చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles