Priyanka Case: Bar council key decision ప్రియాంక కేసు: బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

Priyanka case police says only four accused none is absconding

veterinary doctor murdered and burnt, burnt body of woman vet, Priyanka reddy murdered, Priyanka reddy burnt, priyanka reddy accused, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, chatanpally village, madhapur, shadnagar, lorry drivers, scooty, bar council, laywers, four accused, prakash reddy, dcp shamshabad, cyberabad police, Telangana, Crime

Police says only four people involved in Hyderabad Veterinary doctor Priyanka reddy abduction, gangrape and murder case and there is no fifth accused and none is absconding. Meanwhile Bar council has taken key decision in priyanaka reddy case.

ప్రియాంక కేసు: బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. నిందితులు వీళ్లే: పోలీసులు

Posted: 11/30/2019 12:56 PM IST
Priyanka case police says only four accused none is absconding

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై న్యాయవాదుల బార్ కౌన్సీల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంకరెడ్డి వాహనాన్ని పంక్చర్ చసి అమెకు సాయం చేస్తున్నట్లుగా నటించి.. దారుణంగా సామూహిక అత్యాచారం జరిపి హత్యమార్చి.. దహనం చేసిన మానవ మృగాళ్లును పోలీసులు వైద్య పరీక్షల అనంతరం న్యాస్థానంలో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలో ప్రియాంక కేసుకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున న్యాయవాదులెవరూ కోర్టులో వాదించకూడదని తీర్మానం చేసింది.

నిందితులకు న్యాయస్థానమే న్యాయవాదిని సమకూర్చినా.. వారికి కూడా ఈ కేసును వాదించకూడదని కోరుతామని అన్నారు. నిందితులకు మరణశిక్ష పడేవరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా లాయర్లు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో వున్న సంస్కృతిని మరచి.. ఆడపిల్లలపై కామోన్మాదంతో వ్యవహరిస్తే వారికి బతికే హక్కు లేదని న్యాయస్థానం తీర్పునిచచేలా మరోవైపు, ప్రియాంక హత్యపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు, ప్రజాసంఘాలు నేతలు యత్నించారు.  

ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసుపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి మీడియాకు ఈ రోజు మరికొన్ని వివరాలు తెలిపారు. ఆమె హత్య కేసులో నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారని తెలిపిన ఆయన... ఐదో నిందితుడు ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాము కోర్టుకి అన్ని ఆధారాలు సమర్పించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. కాసేపట్లో షాద్ నగర్ ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles