TTD to extend vaikunta dwara darshanam upto 10 days తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం

Ttd to extend vaikunta dwara darshanam upto 10 days

Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Vaikunta dwaram, Vaikunta Ekadasi, Mukkoti Ekadasi, Uttara dwara darshanam, devotional

Tirumala tirupati devasthanam Temple Board has taken desicion to extend vaikunta dwara darshanam to devotees from 2 days to 10 days ie from Ekadasi to panchami

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్: పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం..

Posted: 11/27/2019 05:22 PM IST
Ttd to extend vaikunta dwara darshanam upto 10 days

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి వెళ్లే ద్వారం వైకుంఠ ద్వారం. దీన్ని ఉత్తర ద్వారమని కూడా భక్తులు పిలుస్తుంటారు. పుష్యమీ మాసంలో వచ్చే శుద్ద ఏకాదశిని భక్తులు వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ పర్వదినాన అన్ని వైష్ణవాలయాల్లో సాధారణంగా భక్తులు దర్శనానికి వెళ్లే తూర్పు ద్వారాల గుండా కాకుండా భక్తులను ఉత్తర ద్వారాల నుంచి దర్శనానికి పంపిస్తుంటారు. ఉత్తర ద్వారాల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులు పోటీపడుతుంటారు.

అయితే ద్వాదశి రోజున కేవలం పరమపవిత్రమైన ఫుణ్యక్షేత్రాల్లో మాత్రమే.. అదీనూ భక్తుల రద్దీని దృష్ట్యా మాత్రమే అనుమతిస్తారు. అప్పుడు మినహా సంవత్సరంలో మరెప్పుడూ ఆ ద్వారా దర్శనం అందుబాటులో వుండదు. అయితే సరిగ్గా ఈ పవిత్రమైన రోజులలో ఉత్తరద్వార దర్శనాల ద్వారా భక్తులను అనుమతించేందుకు కారణం కూడా వుంది. ఈ ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వాసం. ఇక అల వైకుంఠానికి చేరుకునే క్రమంలో ఇల వైకుంఠమైన తిరుమలలో ఉత్తర ద్వారా దర్శన భాగ్యం లభించే భక్తులు కొందరే. దీంతో ఆ అవకాశాన్ని ఇకపై భక్తులందరికీ కలిగించేందుకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే పరిమితమైన ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని 10 రోజులు తెరచి ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. ఈ పది రోజులూ ఇవే ద్వారాల గుండా భక్తులను అనుమతించేందుకు నిర్ణయించింది. అనగా వచ్చే ఏడాది జనవరి 6న రానున్న వైకుంఠ ఏకాదశి మొదలుకుని బహుళపక్షంలో వచ్చే పంచమి వరకు అంటే రమారమి సంక్రాంతి, కనుమ పర్వదినాలలోనూ భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.

ఈ నిర్ణయం తీసుకునేముందు టీటీడీ పాలక మండలి సభ్యులు ఆగమ శాస్త్ర నిపుణులను కూడా పరిగణలోకి తీసుకుని వారి నుంచి అంగీకారం పోందిన పిమ్మటే నూతన విధానాన్ని అమలులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ద్వారాలను తెరిచి, ఆపై 10 రోజుల పాటు వీటి గుండా భక్తులను పంపాలని, ఈ నిర్ణయం వల్ల రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని, మరింత మందికి వైకుంఠ దర్శనం కల్పించే వీలుంటుందని అధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles