'Tantrik' poojas at Srikalahasti temple creates stir శ్రీకాళహస్తి నీలకంఠేశ్వరస్వామి దేవాలయంలో తాంత్రిక పూజలు..

Tantrik poojas at bhairavakona temple in andhra pradesh creates stir

Srikalahasthi shiva temple, tantrik poojas, Srikalahasthi temple tantrik poojas, neelakanteshwara temple, Lord Kalabhairava Temple, Bhairavakona temple, departmental inquiry, Minister Vellampalli Srinivasa Rao, Andhra Pradesh, Crime

Allegations of 'tantrik' poojas performed in a temple attached to the famous Lord Shiva shrine of Srikalahasthi in Chittoor district of Andhra Pradesh on the intervening night of Tuesday and Wednesday created a stir in the state.

శ్రీకాళహస్తి నీలకంఠేశ్వరస్వామి దేవాలయంలో తాంత్రిక పూజలు..

Posted: 11/27/2019 02:37 PM IST
Tantrik poojas at bhairavakona temple in andhra pradesh creates stir

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మరోమారు తాంత్రిక పూజల కలకలం రేగింది. శ్రీకాళహస్తి ప్రధాన ఆలయానికి అనుబంధంగా వేడం గ్రామంలో కొలువైన నీలకంఠేశ్వరస్వామి, శ్రీకాలభైరవ స్వామి దేవాలయంలో కొంతమంది తమిళులు క్షుద్రపూజలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఆలయంలో కొందరు తమిళనాడుకు చెందని వ్యక్తులు అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ క్షుద్రపూజలకు శ్రీకాళహస్తి ఆయన సెక్యూరిటీ గార్డులు సహకరించారని సమాచారం. కాగా ఈ పూజలకు ఏకంగా శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ అనుమతి ఇచ్చారని తెలుస్తొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి అమావాస్య కావడంతో.. శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా వున్న వేడం గ్రామంలోని నీలకంఠేశ్వర దేవాలయం, శ్రీకాలభైరవస్వామి దేవాలయంలో అర్థరాత్రి కొందరు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారని సమాచాం అందింది. దీంతో రంగంలోకి దిగిన తాము అక్కడికి వెళ్లి చూడగా, నలుగురు తమిళులు అమావాస్య చీకట్లో పరమేశ్వరుడికి క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. దీనిని గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన సెక్యూరిటీ గార్డులు పరారయ్యారు.

కాగా నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా, శ్రీకాళహస్తి ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ధన్ పాల్ కు కూడా ఈ తాంత్రిక పూజల్లో ప్రమేయముందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు శాఖాపర విచారణకు కూడా అదేశించారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీరియస్ గా తీసుకున్నారు. క్షుద్రపూజల నిర్వహణలో అసిస్టెంట్ ఈవో పాత్ర ప్రమేయంపై తేల్చాలని ఆయన అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles