Vijayawada farmers to get developed plots అమరావతి నిర్మాణాలు వేగవంతం.. సీఎం అదేశం

Amaravati row heats up jagan orders to speed up work

Andhra government, YS Jagan Mohan Reddy, Andhra Pradesh farmers, Vijayawada farmers, Amaravati, Capital constructions, Happy Nest Project, Andhra Pradesh, Politics

In a significant development, allaying fears of the farmers, who gave up their lands for the construction of the capital city, the State government decided to develop and hand over plots to them.

అమరావతి నిర్మాణాలు వేగవంతం.. సీఎం అదేశం

Posted: 11/26/2019 06:13 PM IST
Amaravati row heats up jagan orders to speed up work

ఆంధ్ర్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలపై రాజకీయ వేడి రాజుకుంటున్న తరుణంలో.. సీఆర్‌డీఏ పరిధిలోని ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణ విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగినట్టుగా ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులును దృష్టిలో పెట్టుకుని, అనవసర ఖర్చులకు పోకుండా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలన్నారు.

నిర్మాణాలు కొంత భాగం పనులు మాత్రమే మిగిలివున్న వాటిపై ముందు దృష్టిపెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. పనుల నిర్మాణంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందన్నారు. సీఆర్డీఏ పరిధిలో ఇంతవరకూ జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయన్న దానిపై సీఎం సమగ్రంగా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేవాటి ప్రాదిపదికన ఎంచుకోవాలని సూచించారు.

సీఆర్‌డిఏ పరిధిలో రోడ్ల డిజైన్‌ గురించి అధికారులను పూర్తి వివరాలు అడిగిన సీఎం, ప్లానింగ్‌లో ఎక్కడా తప్పులుండకూడదన్నారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్లు తదితర అంశాలపై ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్ధితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం చేయగా మిగిలిన భూమిని ల్యాండ్‌స్కేపింగ్‌ చేసి సుందరీకరించాలన్నారు.

మౌలికసదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి.. వారికి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యన్నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, సీఆర్‌డిఏ కమీషనర్‌ లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles