BJP candidate manhandled by TMC workers బీజేపి అభ్యర్థికి పరాభవం.. అడ్డగించి మరీ ఆంగతకుల దాడి..

Bengal bjp leader kicked thrown in ditch by tmc workers in karimpur bypolls

Joy Prakash Majumdar, Bengal BJP leader kicked, thrown in ditch by Trinamool workers during Karimpur bypoll, Mukhul Roy, WestBengal, politics

West Bengal BJP Vice President and candidate for Karimpur bypoll, Joy Prakash Majumdar manhandled and kicked allegedly by TMC workers as voting is underway in the constituency.

బీజేపి అభ్యర్థికి పరాభవం.. అడ్డగించి మరీ ఆంగతకుల దాడి..

Posted: 11/25/2019 02:53 PM IST
Bengal bjp leader kicked thrown in ditch by tmc workers in karimpur bypolls

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపి అభ్యర్థికి తీవ్ర పరాభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్ లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఖరాగ్పూర్ సర్ధార్, కాలియాగంజ్ సహా కరీంపూర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపి ఉపాధ్యక్షుడు, కరీంపూర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జైప్రకాష్ మజుందార్ పై అగంతకులు చేయిచేసుకున్నారు. ఏకంగా అతన్ని గుంటలోకి నెట్టివేయడంతో పాటు కాలితో తన్నారు. ఈ ఘటనతో కరీంపూర్ నియోజకవర్గంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కరీంపూర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ఓటింగ్ ను పరిశీలించేందుకు ఆయన తన నియోజకవర్గంలోని బూత్ లను పర్యటిస్తున్నండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జియాఘాట్‌ ఇస్లాంపూర్‌ ప్రైమరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్తున్న ఆయనను అక్కడే వున్న కొందరు అగంతకులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా అందరూ కలసి ఆయనపైకి తోసుకెళ్లారు. ఆపై ఆయనను చోక్కా పట్టుకుని కొట్టారు. ఆ తరువాత నెట్టివేశారు. దీంతో ఆయన అదుపుతప్పి పక్కనే వున్న గొతిలోకి వెళ్తుండగా, అలా నియంత్రించుకుని బయటకు వస్తున్నక్రమంలో ఇద్దరు అగంతకులు కాలితో బలంగా తన్నారు.

దీంతో ఆయన ఒక్కఉదుటన ఎగిరిపడ్డారు. కొద్దిసేపు ఏం జరిగిందన్న షాక్ లోకి వెళ్లిన ఆయన వెనువెంటనే తేరుకుని.. అభ్యర్థినైన తనపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు సిగ్గుపడాలని అన్నారు. తనపై నిజంగా అంత కోపం వుంటే ప్రజాస్వామ్యబద్దంగా తనపై పోటీ చేసి సత్తా చాటాలని అయన అన్నారు. పోలింగ్‌ బూత్ బయట ఈ ఘటన జరగడంతో అక్కడికి హుటాహుటిన వచ్చిన పోలీసు బలగాలు ఆయనను పైకి లాగి.. వెనువెంటనే అక్కడున్నవారిని చెదరగొట్టారు.

కాగా, తనపై దాడికి యత్నించిన తృణమూల్‌ కార్యకర్తలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రకాశ్‌ మజుందార్‌ డిమాండ్‌ చేశారు. తృణమూల్‌ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి ఈ దాడియే నిదర్శనమన్నారు. తృణమూల్‌ నేతలు వీధి రౌడిల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా తృణమూల్‌ నేతలు మాత్రం ఈ దాడిని తమ కార్యకర్తలు చేయలేదని చెప్పుకొచ్చారు. స్థానికులే బీజేపీపై ఆగ్రహంతో జైప్రకాశ్‌ ముజుందార్‌పై దాడి చేశారని పేర్కొన్నారు.

కాగా, జైప్రకాష్ ముజుందార్ పై అధికార పార్టీ కార్యకర్తలు దారుణంగా వ్యవహరించడంపై ఎన్నికల కమీషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ బీజేపి నేత ముకుల్ రాయ్ లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఓ బిజేపి అభ్యర్థిపై వ్యవహరించిన తీరుపై ఆ జిల్లా ఎస్పీ. ఏఎస్పీలను తక్షణం బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కలియాగంజ్‌ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పపర్మతానాథ్‌ రాయ్‌ మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కరీంపూర్‌నుంచి ఎన్నికైన టిఎంసి ఎమ్మెల్యే మహువా మొయిత్రా, ఖరగ్‌పూర్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే దిలీప్‌ ఘోష్‌ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles