జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోమారు వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. ఈ సారి వారిని ఏమీ అనకుండానే.. వారు ఏం మాట్లాడతారని వేచిచూస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తాను మాతృబాషను మృతబాషగా మార్చవద్దని కోరితే.. స్పందించిన వైసీపీ నేతలు.. జగన్.. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూద్దామని వేచి చూస్తున్నానని అన్నారు. అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రితం రోజున మాతృభాష అవశ్యకతపై వ్యాఖ్యాలు చేశారు. ఐక్యరాజ్యసమితి కూడా మాతృ భాషల ప్రాధాన్యతను గుర్తించిందని ఆయన అన్నారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శతాబ్దాలుగా మన దేశంలో వందలాది భాషలు వికసించాయని... వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఈరోజు నుంచే మీ భాష, మీ యాసను ఉపయోగించడం ప్రారంభించండని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, అంతర్జాతీయ భాషల సంవత్సరం సందర్భాన, మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించింది విన్న జగన్ రెడ్డిగారు, మిగతా వైసీపీ సమూహం ఎలా స్పందిస్తారో విందామని వేచి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి ఇష్టమైన మీడియంలో వారు చదువుకునేలా విద్యార్థులకు వెసులుబాటు ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
ఇక రాయలసీమలోని పరిస్థితులపై ట్వీట్ చేస్తూ.. 1996లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రచురించిన పుస్తకాన్ని పోస్ట్ చేస్తూ.. ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఈ సీమ నుంచే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఎక్కువ మంది ఎంపికై బాధ్యతలను నిర్వర్తించినా.. ఈ సీమలోనే మానవ హక్కు ల ఉల్లంఘన అధికంగా జరిగిందని ఆయన పేర్కోన్నారు. ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బహిర్గతమయ్యాయన్నారు. దళిత, వెనకబడిన కులాలతో పాటు మిగిలిన కులాలకు చెందిన సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వల్ల ఎలా నలిగిపోయారో.. ఎందుకు వలసలు వెళ్లిపోయారో అర్థమవుతుందని అన్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే రాయసీమ వెనుకబాటు తనానికి కారణం ఏంటో ఈ పుస్తకం ద్వారా అవగతం అవుతుందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పౌరహక్కుల సంఘం ప్రచురించిన ఈ పుస్తకంలోనే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రస్తావన కూడా వుందని ఆయన తెలిపారు. ‘మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమ లోనే.. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని, 14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి ‘ ఉదంతమే దానికి ఉదాహరణ' అని పవన్ మరో ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. pic.twitter.com/2pNalKgUvt
— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more