Sharad Pawar challenges Fadnavis on trust vote ‘మహా’ రాజకీయం: ఎన్సీపి నుంచి అజిత్ పవార్ బహిష్కరణ

Sharad pawar announces expulsion of nephew from ncp

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Ajit pawar, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, bjp, congress, sonia gandhi, sharad pawar, sonia gandhi sharad pawar meeting, shiv sena, maharashtra govt formation, Maharashtra, Politics

Hours after his nephew Ajit Pawar was sworn in as Deputy Chief Minister of Maharashtra, NCP chief Sharad Pawar said the legislature wing of the party would elect a new leader later in the evening.

‘మహా’ రాజకీయం: ఎన్సీపి నుంచి అజిత్ పవార్ బహిష్కరణ

Posted: 11/23/2019 06:09 PM IST
Sharad pawar announces expulsion of nephew from ncp

మహారాష్ట్రలో అనూహ్య రాజకీయానికి తెరలేపి.. పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు తెరలేపిన ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ ను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపితో చేతులు కలపి రాష్ట్రంలో బీజేపి ప్రభుత్వం ఏర్పడేందుకు కారణమైన అజిత్ తమ పార్టీకి వెన్నుపోటు పోడిచారని.. అందుచేత ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పారు. అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతమని, ఎన్‌సీపీకి సంబంధం లేదంటూ శరద్ పవార్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి అజిత్ పవార్‌ను తొలగించారు. ఇవాళ సాయంత్రం పార్టీ సభ్యులతో భేటీ అయిన అనంతరం మరో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని చెప్పారు. అంతేకాదు, పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అంతటితో ఆగని ఆయన ఏకంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మనజాలదని సవాల్ చేశారు.

అజిత్ పవార్ వెంట వచ్చింది కేవలం పది నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని, వారిందరికి కూడా ఏదో పని వుందని అజిత్ పవార్ రాజ్ భవన్ కు పిలిచారని చెప్పారు. అయితే అక్కడి వరకు వెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న తరువాత వారిలో ముగ్గురు వెనుదిరిగి వచ్చారని చెప్పారు. ఇక అజిత్ తో వున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత.. వారు బలాన్ని ఎలా నిరూపించుకుంటారని ప్రశ్నించారు. వారు బలాన్ని నిరూపించుకోని పక్షంలో తిరిగి తమకే అవకాశం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే అజిత్ పవార్ తో వున్న ఏడుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ చేతులు కలిపేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. అజిత్ తో వున్న ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో వున్నారని రేపో, మాపో వారు తిరిగి వచ్చేస్తారని శరద్ పవార్ అన్నారు. మరోవైపు ప్రస్తుతం పరిణామాలపై చర్చించేందుకు సాయంత్రం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో శరద్‌ పవార్‌ సమావేశం కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles