Pawan Kalyan Reviews Six Months of YSRCP's Rule వైసీపీ ఆరు నెలల పాలనపై ఆరు పదాల్లో.. పవన్ కల్యాణ్

Pawan kalyan tweets of cm ys jagan s six months administration in six words

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, government building colour change, Gandhi statue colour change, 350-A, Telugu language, English medium, Telugu medium, Mother Tongue, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

The Janasena party chief Pawan Kalyan has made an interesting tweet on AP Chief Minister YS Jagan Mohan Reddy's six months administration after the elections in the state.

వైసీపీ ఆరు నెలల పాలనపై ఆరు పదాల్లో.. పవన్ కల్యాణ్

Posted: 11/23/2019 03:41 PM IST
Pawan kalyan tweets of cm ys jagan s six months administration in six words

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన ఎలా వుందన్న విషయాన్ని కేవలం ఆరు మాటల్లో చెప్పారు. ఆరు నెలల పాటు సాగిన వైఎస్ జగన్ సర్కారు పాలనపై ఆరు మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, దుందుడుకు తనం, కక్ష సాధింపు, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నంగా పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ లేటెస్టుగా అన ట్వీట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఈ ఆరు పదాలను వైసీపీ పాలనకు అన్వయించడానికి కారణాలను కూడా పవన్ కల్యాణ్ వివరించారు.

కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వక వరద నీరుతో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు విధ్వంసం పదం కిందికి వస్తాయని ఆయన పేర్కోన్నారు. కాంట్రాక్టు రద్దులు, అమరావతి రాజధాని, జపాన్ రాయబారి-సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు ఆర్బిట్రేషన్లు దుందుడుకుతనం కిందకు వస్తాయని పవన్ అన్నారు. శ్రీకాకుళంలో సామాన్యకార్యకర్తతో మొదలు కొని ఎమ్మెల్యే రాపాకపై కేసులు బనాయించడం, పోలీసుల వేధింపులు వంటివి కక్ష సాధింపుతనం కిందకు వస్తాయన్నారు. గ్రామ వాలంటీర్లు అంటూ 5 లక్షల ఉద్యోగాలు ప్రకటించి, 2,89,000 మాత్రమే ఇవ్వడం, 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టడం మానసిక వేదన కిందకు వస్తాయన్నారు.

అమరావతి రాజధానిగా ఉంటుందా? ఆంధ్రప్రదేవ్ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుందా? అన్న విషయాలు అనిశ్చితి కిందకు వస్తాయని పవన్ తెలిపారు. ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాష, సంస్కృతులను, భారతీయ సనాతన ధర్మ విచ్ఛిన్నతికి శ్రీకారం చుట్టారని పవన్ పేర్కొన్నారు. 151 సీట్లున్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకుందామని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles