SCR Announces 4103 Posts for 10th Pass Candidates దక్షిణమధ్య రైల్వేలో 4 వేల ఉద్యోగాలు.. అర్హత ఐటీఐ

Rrb scr recruitment 2019 scr announces 4103 posts for 10th pass candidates

2019 RRB Recruitment Exam,RRB Recruitment,RRB Recruitment 2019,RRB Recruitment 2019-20,RRB SCR Recruitment,RRB SCR Recruitment 2019,RRB SCR Recruitment Exam,SCR Recruitment,SCR Recruitment 2019,South Central Railway,South Central Railway Jobs,South Central Railway Jobs 2019,South Central Railway Recruitment 2019

The South Central Railway (SCR) of the Railway Recruitment Board (RRB) has released 4,103 vacancies for 10th pass candidates. Those who are interested in the available jobs can apply for the same by visiting the official website; scr.indianrailways.gov.in.

దక్షిణమధ్య రైల్వేలో 4 వేల ఉద్యోగాలు.. అర్హత ఐటీఐ

Posted: 11/19/2019 08:46 PM IST
Rrb scr recruitment 2019 scr announces 4103 posts for 10th pass candidates

రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను ప్రకటించింది.  ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 4103 ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ.  

మొత్తం 4103 ఖాళీల్లో ఫిట్టర్- 1460, ఎలక్ట్రీషియన్- 871, డీజిల్ మెకానిక్- 640, వెల్డర్-597, ఏసీ మెకానిక్- 249, ఎలక్ట్రానిక్ మెకానిక్- 102, మెకానిస్ట్- 74, పెయింటర్- 40, ఎంఎండబ్ల్యూ- 34, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18, కార్పెంటర్- 16, ఎంఎంటీఎం- 12 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2019 నవంబర్ 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. 2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.100.  

అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. లాలాగూడ, మెట్టుగూడ, కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లో ఈ యూనిట్లు ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles