devotees throng to take holy dip in karthika masam సముద్ర, నదీ స్నానాలకు క్యూకట్టిన భక్తులు..

Devotees throng to take holy dip in rivers and oceans in karthika masam

karthika masam, karthikam, karthika somavaram, telugu auspicious month, auspicious karthika masam, shiva temples, rivers, seas, oceans, karthika deepam, devotees, temples, pilgrims, devotional

Devotees from telugu states today throng to sea, ocean, rivers, and riverlets to take auspicious bath on the ocassion of third monday of karthika masam.

సముద్ర, నదీ స్నానాలకు క్యూకట్టిన భక్తులు.. ప్రత్యేక పూజలు..

Posted: 11/18/2019 01:09 PM IST
Devotees throng to take holy dip in rivers and oceans in karthika masam

పవిత్రమైన కార్తీకమాసంలో అందునా హరిహరులకు ప్రతీకరమైన సోమవారం రోజున బ్రహ్మముహూర్తంలో ఉత్తమమైన సముద్ర, నదీ స్నానాలు ఆచరించడం వల్ల తెలిసీతెలియక చేసిన పాపాలన్నీ హరించుకు పోతాయని భక్తుల విశ్వాసం. దీంతో కార్తీకమాస మూడవ సోమవారం సందర్భంగా ఇవాళ అనేకమంది భక్తులు సముద్రం, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేకువజాము నుంచే బారులు తీరారు. మరీ ముఖ్యంగా సముద్ర తీరాల్లోని ఆలయాలు, నదీ తీరాల్లోని ఫుణ్యక్షేత్రాలకు క్యూకట్టిన భక్తులు తెల్లవారు జామునుంచే స్నానాలు ఆచరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ ఉన్న బీచ్ లన్నీ తెల్లవారుజామునే భక్తులతో నిండిపోయాయి. గోదావరి, కృష్ణా నదీతీరాలతో పాటు ఉపనదీ తీరాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా శ్రీశైలం, విజయవాడ, రాజమండ్రి పుష్కర ఘాట్, కోటి లింగాల రేవు, బాసర, ధర్మపురి, ఆలంపూర్ జోగులాంభ, కర్నూలు ఆంజనేయ స్వామి దేవాలయం వంటి క్షేత్లాల్లో కిక్కిరిసిన భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీకాళహస్తిలోనూ వేలాదిమంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చాడు. పంచారామాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో అర్ధరాత్రి నుంచే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు ప్రారంభం అయ్యాయి. వేకవజామున 2 గంటల నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు.

ఇక గోదావరి రేవుల వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇటు తిరుపతిలోని కపిలేశ్వరుని ఆలయం వద్ద ఉండే కపిల తీర్థం కోనేటి వద్ద రద్దీ అధికంగా ఉంది. తిరుమలలోనూ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇదిలావుండగా, ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హరిహరుల దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవాలయాలన్నింటా హరి నామస్మరణ, శివనామస్మరణ మార్మోగుతోంది. భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శైవక్షేత్రాల్లో మహాన్యసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. సోమవారం కావడంతో కార్తీక దీపాలను వెలిగించేందుకు భక్తులు పోటీపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles