Amaravathi Government Introducing 4 new cards నూతనంగా నాలుగు కార్డులను విడుదల చేయనున్న - అమరావతి పాలకులు

Amaravathi government introducing 4 new cards

YS Jagan Government, Amaravathi, ration cards, health cards, Andhra Pradesh

The Amaravathi Government Introducing four new cards for the poor and middle class andhra pradesh people

నూతనంగా నాలుగు కార్డులను విడుదల చేయనున్న - అమరావతి పాలకులు

Posted: 11/15/2019 01:01 PM IST
Amaravathi government introducing 4 new cards

అమరావతి పాలకులు తమ ప్రజలకై ఎంతగానో ఆలోచనలు చేస్తున్నారు. వారి శ్రేయస్సు కై పాటు పడుతున్నారు. నేడు కొత్తగా పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని నూతనంగా నాలుగు కార్డులను విడుదల చేయనున్నది. అసలు ఈ కార్డుల విషయానికి వెళితే మొదటి కార్డు ఏమో చౌక దుకాణంలో ఉచిత నిత్యావసరలా ( బియ్యం) కోసం, రెండో కార్డు ఏమో ( ఆరోగ్య భీమా కార్డు) ఉచిత ఆరోగ్య సేవల కోసం, మూడో కార్డు ఏమో ఫీజు రీయింబర్సుమెంట్ మరియు నాలుగో కార్డు ఏమో పింఛన్ పొందే వారికి వర్తిస్తుంది. ఈ నెల 20 న గ్రామా సచివాలయం లో అర్హులైనా వారికి ఈ కార్డుల పంపిణి జరగ నున్నది. ఈ కార్డుల పంపిణి ప్రస్తుతం ఉన్న నిబంధనలన్నింటిని తేలిక చేద్దామనే భావన ప్రభుత్వంలో ఉంది. ఒక రెండు మూడు రోజులలో ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకొని ప్రజలలో అమలు చేయనున్నది.

ఇప్పుడు మన అందరికి సహజంగా ఉన్న తెల కార్డు పౌరసరఫరా శాఖ నుండి లభించినదే. ఈ కార్డు నే మనము మన అత్యంత అవసరాల కై వినియోగిస్తూ ఉంటాము. పౌరసరఫరాల శాఖ బియ్యం కార్డు నే ఇస్తుంది. దీని సహాయం తో బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులను, ఉచితంగా పొందుతున్నాము. ఈ కార్డు పొందాక మునుపు ఉన్న కార్డు అనవసరం అని అనుకోకూడదు. ఎందుకనగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది ఇరు కార్డు లా వినియోగ ఫలానికై.

తుదిగా ఏమిటి అంటే ఇప్పుడు కొత్తగా గుర్తింపు పొందే వారితో పాటు మునుపు ఉన్న కార్డు లబ్ది దారులకు కూడా ఈ సదుపాయం లభిస్తుంది. మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక నాలుగు కార్డు లా సాయం తో ప్రజలను ఆదుకోవాలనే ఒక మంచి ఆలోచన చేస్తుంది. ఆ అమరావతి నగర తల్లి సాక్షిగా గోదావరి అమ్మ అండ తో కార్డుల పంపిణి విజయవంతం కావాలని అభిలాషిద్దాం.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan Government  Amaravathi  ration cards  Andhra Pradesh  

Other Articles