Buglars uses pepper spray and rob Rs 30 Lakhs పెప్పర్ స్ర్పే చల్లి.. వ్యాపారి నుంచి రూ.30 లక్షల దోపిడి..

Buglars uses pepper spray and rob gold ormanent business man for rs 30 lakhs

rohit gold ornaments shop, navakar gold shop, ruparam, Rs 30 Lakhs, pepper spray, mahankali police station, secundrabad, Telangana Crime

With keen information Buglars waiting in first floor of a buliding of secundrabad mahankali police station anduses pepper spray and rob gold ormanent business man for RS 30 Lakhs

పెప్పర్ స్ర్పే చల్లి.. వ్యాపారి నుంచి రూ.30 లక్షల దోపిడి..

Posted: 11/13/2019 10:43 AM IST
Buglars uses pepper spray and rob gold ormanent business man for rs 30 lakhs

సికింద్రాబాదులో గత రాత్రి జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి అతడి వద్ద ఉన్న రూ.30 లక్షల సంచి లాక్కుని దుండగులు పరారయ్యారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా స్థానిక వ్యాపారుల్లో పెను కలకలం రేపింది. అయితే ఇది ఖచ్చితంగా తెలిపిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీచేసేందుకు ముందు రెక్కీ కూడా నిర్వహించి.. పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడివుంటారని స్థానికులు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్ లోని మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ చోరి వివరాలు ఇలా వున్నాయి.. మహంకాళి ఆలయ సమీపంలో రోహిత్ అనే నగల తయారీ దుకాణం, ఆ సమీపంలోనే నవకార్ అనే నగల విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాల మధ్య లావాదేవీలు ఉన్నాయి. రోహిత్ దుకాణం బంగారు అభరణాలను తయారు చేస్తుంటుంది. కాగా నూతన డిజైన్లలలో తయారు చేసేన నగలను నవకార్ షాపు కొనుగోలు చేసి కస్టమర్లను విక్రయిస్తుంటుంది.

ఈ క్రమంలో రోహిత్ షాపునకు చెందిన రూపారామ్ అనే వ్యక్తి నవకార్ నుంచి తమకు రావాల్సిన రూ.30 లక్షలను తీసుకుని షాపునకు బయలుదేరాడు. ఈ క్రమంలో తమ దుకాణం ఉన్న భవనం మెట్లు ఎక్కుతుండగా మొదటి అంతస్తు సెల్లార్‌లో వేచి ఉన్న దుండగులు రూపారామ్‌పై పెప్పర్ స్ప్రే చల్లి అతడి నుంచి డబ్బు సంచి లాక్కుని బైక్‌పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles