Cannot declare RTC staff strike illegal: HC టీఎస్ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దం అనలేం: హైకోర్టు

Cannot declare rtc staff strike illegal high court

TSRTC Workers, High Court, Raghvendra Singh Chauhan, Assistant Solicitor General, N. Rajeshwar Rao, RTC MD Sunil sharma, RTC MD Sunil sharma Affidavit, RTC MD affidavit, High court urges workers to call off strike, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

The Telangana High Court said it cannot direct the State government to hold negotiations with the striking employees of TSRTC. “We cannot declare the ongoing strike by TSRTC employees as illegal either,” a Division Bench observed while hearing a batch of PIL and writ petitions on different aspects of the strike.

టీఎస్ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దం అనలేం: హైకోర్టు

Posted: 11/12/2019 06:36 PM IST
Cannot declare rtc staff strike illegal high court

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని న్యాయవాది విద్యాసాగర్‌ తెలపగా.. పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో ఆరునెలల వరకే  వర్తిస్తుందని పేర్కొంది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని... చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈమేరకు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె విషయంలో తాము న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. కోర్టు సూచించిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసి సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ‘హైకోర్టు ఈరోజు వాదనల తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి రేపు మధ్యాహ్నంలోగా కమిటీ ఏర్పాటుపై వివరాలను వెల్లడిస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలపడం బాగానే ఉంది’ అని అన్నారు.

తాము కూడా ముఖ్యమంత్రిని అదే కోరుతున్నామన్నారు. కమిటీ వేసి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. భేషజాలకు పోకుండా కమిటీ ఏర్పాటుకు అంగీకరించి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నట్లు చెప్పుకోచ్చారు. కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం తమకు అంగీకారమన్నారు. కమిటీకి కాలపరిమితి ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్మని స్పష్టం చేశారు. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని రాష్ట్రోన్నత న్యాయస్థానం తెలిపిందని అశ్వత్థామరెడ్డి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles