Modi cabinet recommends President's rule in Maharashtra ‘మహా’ప్రజాతీర్పుపై సర్జికల్ స్ట్రైక్.. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు..

Union cabinet recommends president s rule in maharashtra

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Aravind sawant, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

The Union Cabinet recommended President's rule in Maharashtra even as top leaders from the NCP, Congress and Shiv Sena were holding a flurry of consultations in a bid to tot up the numbers and resolve the impasse over government formation in the state.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. ఆమోదం తెలిపిన కేంద్రం

Posted: 11/12/2019 04:43 PM IST
Union cabinet recommends president s rule in maharashtra

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గత 20 రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనపై ఆ రాష్ట్ర గవర్నర్ తనదైన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో బీజేపి తరువాతి స్థానంలో నిలిచిన రెండు పార్టీలను ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే వారు నిర్ణయం తీసుకునేందుకు ఇచ్చిన గడువు కూడా ముగియకుండానే.. ఆఘమేఘాల మీద కేంద్రానికి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ.. సిఫార్సు చేశారు. మహారాష్ట్ర గవర్నర్ పంపిన సిఫార్సును ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కూడా అంతే వేగంగా రాష్ట్రపతి పాలనకు జై కొట్టింది.

తమకు ఇచ్చిన గడువు ముగియకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర ప్రజాతీర్పుపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లుగా వుందని విపక్షాలు అరోపిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా శివసేన సిద్దమైంది. దీంతో గత 20 రోజులు ట్విస్టుల సుడిగుండంలో తిరిగిన మహా రాజకీయాలకు రాష్ట్రపతి పాలనతో బ్రేక్ పడనుంది. మహారాష్ట్రలో గత ప్రభుత్వ పదవీకాలం ఈ నెల 9న ముగిసింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నావిస్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అహ్వానించినా.. అందుకు బీజేపి వ్యతిరేకించింది. తమ వద్ద తగినంత బలం లేదని, దీంతో తాము నిర్ణీత సమయంలో బలనిరూపణ చేయలేమని వెనుకంజ వేసింది. దీంతో గవర్నర్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించారు. అందుకుగానూ గవర్నర్ శివసేనకు నిర్ణీత గడువును కూడా ఇచ్చారు. అయితే గడువు ముగియకుండానే గవర్నర్ ఎన్సీపీని అహ్వానించారు. వారికి కూడా ఇవాళ సాయంత్రం వరకు గడవు ఇచ్చారు. అయితే గడవు ముగిసిపోకముందే వేగంగా నిర్ణయాలు తీసుకుని మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఆయన కేంద్రానికి సిఫార్సు చేయడం.. కేంద్ర క్యాబినెట్ భేటీ అయ్యి సిఫార్సును అమోదించడం చకచకా జరిగిపోయాయి.

అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు కావడం ఇది మూడో పర్యాయం. 1980లో తొలిసారి, 2014లో రెండోసారి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలైంది. 1980 ఫిబ్రవరి 17 నుంచి 1980 జూన్ 8 వరకు 112 రోజుల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు 33 రోజుల పాటు రెండోసారి రాష్ట్రపతి పాలన నడిచింది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్.. ఎన్సీపీ, ఇతరుల నుంచి విడిపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ అయింది. తాజాగా మూడోసారి నవంబర్ 12 నుంచి మూడోసారి అమల్లోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles