MMTS Loco Pilot Chandra Shekar still serious విషమంగానే ఎంఎంటీఎస్ లోకో పైలట్ ఆరోగ్యం

Care hospital health bulleton mmts loco pilot chandra shekar still serious

train accident, Nimboli adda, kachiguda, railway station, mmts train, kurnool inter-city train, loco pilot, chandrashekar, Baleshwaramma, Shekar, Raj kumar, sajid, Md, Ibrahim, signal failure, hyderabad, Crime

Care Hospital releases Health bulletion on the health of the injured in Kacheguda Railway Station Trains colliade accident, it states the health conditiion of all the injured is stable expect the Loco Pilot ChandraShekar.

కేర్ హెల్త్ బులిటిన్: విషమంగానే ఎంఎంటీఎస్ లోకో పైలట్ ఆరోగ్యం

Posted: 11/12/2019 02:55 PM IST
Care hospital health bulleton mmts loco pilot chandra shekar still serious

కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలోని నింబోలి అడ్డ ప్రాంతంలో అగివున్న కర్నూలు ఇంటర్సీటీ ఎక్సప్రెస్ రైలును లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనలో లోకో పైలట్ మినహా అందరి పరిస్థితి నిలకడగా వుందని కేర్ అసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్యాబిన్లో చిక్కుకున్న ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, అతనికి గత 24 గంటలుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని కేర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.సుష్మ వెల్లడించారు.

ఈ మేరకు ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని, పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. అతడితోపాటు ప్రమాదంలో గాయపడిన శేఖర్‌, బేలేశ్వరమ్మ, రాజ్‌కుమార్‌, సాజిద్‌, మహ్మద్‌ ఇబ్రహీంకు వైద్యం అందిస్తున్నామని, వీరి ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉందని చెప్పారు. సోమవారం ఉదయం నింబోలి అడ్డా వద్ద జరిగిన ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలోని క్షతగాత్రులంతా బాగున్నారని తెలిపారు.

క్రితం రోజు ఉదయం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు... సికింద్రాబాద్‌కు వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం 10.42 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది గాయాలపాలయ్యారు. హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాన లైను నుంచి లూపు లైను ద్వారా 4వ ప్లాట్‌ఫాం వైపు వస్తుండగా ఎంఎంటీఎస్‌ రైలు కాచిగూడ నుంచి ఫలక్‌నుమా వెళ్తూ వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఎంఎంటీఎస్‌ నుంచి ఆరు బోగీలు గాల్లో లేచి పట్టాలు తప్పాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles