Tension rose over other Religious Bhajans at Annavaram Temple అన్నవరం సత్యదేవుడి సాక్షిగా అన్యమత భజనలు.. కలకలం..!

Devotees object other religious bhajans at annavaram temple on the eve of karthika pournami

karthika pournami, Rathnagiri Alayam, Satyanarayana swamy temple, Annavaram, other religoius prayers, East Godavari, Irupaka, special pujas, satyanarayana swamy, Nataraja bala bhakta sangam, andhra pradesh, politics

Tension rose over a bhajans troop from irupaka Nataraja bala bhakta sangam were arrested after doing other religious bhajans at Annavaram Temple on the eve of Karthika Pournami

అన్నవరం సత్యదేవుడి సాక్షిగా అన్యమత భజనలు.. కలకలం..!

Posted: 11/12/2019 12:26 PM IST
Devotees object other religious bhajans at annavaram temple on the eve of karthika pournami

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు దైవనామస్మరణలో మునిగిపోయారు. ఈ క్రమంలో పవిత్ర ఫుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద పెను కలకలం రేగింది. పరమ పవిత్రమైన ఈ రోజున రత్నగిరిపై వెలసిన రమా సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి వత్రాన్ని చేసుకుంటే తమ ఇంట లమి అన్న పదం పొడచూపదని భక్తుల విశ్వాసం. అందుకనే వేకువ జామునుంచే భక్తులు అన్నవరం కొండకు చేరుకుని తెల్లవారు జాము నుంచే స్వామి వారి వత్రాలలో పాలుపంచుకుంటారు. సాధారణ రోజుల్లో కంటే కార్తీక మాసంలో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు.

అందునా కార్తీక పౌర్ణమి రోజు కావడంతో.. భక్తులు మరింత ఎక్కువగా ఆలయానికి చేరుకున్నారు. ఈ రోజున స్వామి వారి కొండ చుట్టూ గిరి ప్రదిక్షిణం చేస్తే శుభప్రదమని భక్తులు భావిస్తారు. దీంతో వేకువ జామునుంచే వచ్చే భక్త జన సందోహానికి ఉల్లాసం, ఉత్తేజం కలిగించేలా ఆలయ అధికారులు భజన, సంగీత ఇత్యాది సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. ఈ తరుణంలో ఆలయం కొండపై భక్తులకు అన్యమత భజనలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగింది. భక్తులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పవిత్రమైన ఆలయకొండపైకి వచ్చిన భజన భృందం ఏకంగా సత్యదేవుడు వెలసిన కొండపైనే అన్యమత భజనలు పాడటంతో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.

తూర్పు గోదావరి జిల్లా ఇరుపాక గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నగేశ్ నటరాజ బాల భక్త సంఘం భజన చేసేందుకు ఆలయానికి చేరుకుంది. మొదట్లో పలు భజనలు చేసిన తరువాత మెల్లిగా వేరే రాగాన్ని అందుకుందీ బృందం. దీనిని కొండపైనున్న అశేషమంది భక్తుల్లో పలువురు అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భజన బృందం తమ ప్రదర్శనలో భాగంగా ఏసుక్రీస్తు భజనలను ఆలపించడంతో.. అధికారులతో పాటు ఆలయ చైర్మన్ కూడా ఉరుకులు పరుగులు పెడుతూ కళావేదిక వద్దకు వచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించారు. అధికారుల పిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి అన్యమత భజనలు ఆలపించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భజన బృందంలోని సభ్యులకు ఆలయ అధికారులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles