Tejas, railway's 1st 'private' train makes Rs 70 lakh profit! భారత తొలి ప్రైవేటు రైలు తేజస్.. లాభంలోనూ భేష్..!

Irctc lucknow delhi tejas express 1st private train makes rs 70 lakh profit

IRCTC Tejas Express makes profit, Indian Railways, Indian Railways reforms, IRCTC Lucknow-Delhi Tejas Express, 1st private train, makes Rs 70 lakh profit, IRCTC Tejas Express, Indian Railways Catering and Tourism Corporation, IRCTC

IRCTC's Tejas Express has made a profit of around Rs 70 lakh till October this year while earning revenue of nearly Rs 3.70 crore through sale of tickets, sources said, signalling a steady start for the Railways' first "privately" run train.

భారత తొలి ప్రైవేటు రైలు తేజస్.. లాభంలోనూ భేష్..!

Posted: 11/11/2019 04:50 PM IST
Irctc lucknow delhi tejas express 1st private train makes rs 70 lakh profit

తేజస్ ఎక్స్‌ప్రెస్.. భారతీయ రైల్వే నడుపుతున్న తొలి ప్రైవేట్ రైలు ఇది. భారతీయ రైల్వే మొదటి ప్రైవేట్ రైలును నడిపే బాధ్యతను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఐఆర్సీటీసీ తీసుకుంది. అక్టోబర్ 5న ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అంటే నెల రోజులుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. అక్టోబర్ నెలలో తేజస్ ఎక్స్‌ప్రెస్ టికెట్ల అమ్మకం ద్వారా ఐఆర్‌సీటీసీకి రూ.3.70 కోట్ల ఆదాయం రాగా రూ.70 లక్షల లాభం వచ్చింది. తొలి ప్రైవేట్ రైలు శుభారంభాన్ని ఇచ్చినట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి.

లక్నో-ఢిల్లీ మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 5 నుంచి ప్రయాణికులకు సేవల్ని అందిస్తోంది. సుమారు 80-85 శాతం యావరేజ్ ఆక్యుపెన్సీతో రైలు నడుస్తోంది. అంటే... రైలులో సగటును 80-85 శాతం టికెట్లు బుక్ అవుతున్నాయి. కాగా, వారానికి ఆరు రోజులు మాత్రమే నడిచే ఈ రైలుకు అక్టోబర్ 5 నుంచి 28 వరకు ఐఆర్సీటీసీకి అయిన ఖర్చు రూ.3 కోట్లు. అంటే సగటున రోజుకు రూ.14 లక్షలు ఖర్చు పెట్టింది. టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.17.50 లక్షలు ఆర్జించింది. దీంతో నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ.70లక్షలు ఆర్జించింది.

ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ లో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించేలా రైలును తీర్చిదిద్దారు. రైలులో అత్యాధునికమైన సేవలు, టీ, కాఫీ, స్నాక్స్, భోజనం, ఇతర ప్రీమియం సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలులో ప్రయాణించేవారికి రూ.25 లక్షల ప్రమాద బీమాతో పాటు ఇంట్లోని వస్తువులకు కూడా రూ.1 లక్ష బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది ఐఆర్సీటీసీ.

తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఐఆర్సీటీసీ మరో సదుపాయాన్ని కూడా కల్పించింది. అదేంటంటే.. వారికి అందుబాటులోకి పికప్ సర్వీస్‌ కూడా తీసుకువచ్చింది. దీంతో పాటు రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్ బ్యాక్ సదుపాయం కూడా వుంది. అదేంటి అంటే తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు గంట ఆలస్యంగా నడిచిన పక్షంలో ప్రయాణికులకు రూ.100 క్యాష్ బ్యాక్ చెల్లిస్తుంది. ఇక రెండు గంటల పైగా ఆలస్యంగా నడిస్తే.. ప్రయాణికులకు రూ.250 పరిహారాన్ని క్యాష్ బ్యాక్ గా చెల్లిస్తుంది. నామినల్ క్యాన్సలేషన్ ఛార్జెస్ లాంటి సేవలు ఉన్నాయి. సాధారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నవే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways 1st private train  Tejas  Rs 70 lakh profit  first month of operation  IRCTC  

Other Articles