One Kg fish for Rs 1 offer in Tamil Nadu karaikudi రూపాయికే కిలో చేప..! జనం క్యూకట్టారుగా..!!

Vendor sells fish for re1 kg to spread awarenes on healthy eating

Kg Fish for Only Rs.1, Offer Valid Only for First 100 People, for Trading Promotion, Fish for Rs.1, Fish, Re !, Publicity, shop openning Offer, offer on first come first serve, Trading Promotion, Karaikudi, Madurai, Tamil Nadu, business tactics

In a rare gesture, a vendor from Karaikudi sold fish for Rs 1 a kilogram in a bid to spread awareness on consuming fresh fish and thereby developing healthy eating culture. Seller P Manoharan gave away 520 kilograms of fish, which he claimed fresh, and charged the customers only Rs 1 per kg.

రూపాయికే కిలో చేప..! జనం క్యూకట్టారుగా..!!

Posted: 11/11/2019 01:14 PM IST
Vendor sells fish for re1 kg to spread awarenes on healthy eating

కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేవారు వినూత్న ప్రచారాలకు తెరతీస్తారు. అయితే వీరిలో ఒక్కక్కరిది ఒక్కో మార్గం. కొందరు జనాధరణ వున్న నటులను, నటీమణులను అహ్వానిస్తే.. మరికొందరు ప్రచారంలోనూ వైవిద్యాన్ని ప్రదర్శించడంతో పాటు.. తమకు అత్యంత ప్రచారం కలిగేట్టు వ్యవహరిస్తారు. ఇలాంటి ప్రచారమే చేసిన ఓ వ్యాపారికి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని పోందాడు. మొన్నామధ్య కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని కొరుతూ ఓ వ్యాపారి రూపాయికే చీరను విక్రయిస్తూ వినూత్న ప్రచారానికి తెరలేపిన విషయం తెలిసిందే.

అచ్చంగా అదే ఫార్ములాను అమలు చేసి.. తన ప్రచారాన్ని రక్తికట్టించాడు ఓ చేపల వ్యాపారి. అదెలా అంటే.. తాను ప్రారంభించనున్న చేపల దుకాణం స్థానిక ప్రజలందరికీ తెలిసేలా.. నాణ్యమైన చేపలను విక్రయించడంతో పాటు తాజా చేపలను తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు కూడా వివరించాడు. ఇలా చెబితే ఎవరూ వినరని అందుకని తన దుకాణంలో కేజీ చేపలు కేవలం రూపాయి మాత్రమే విక్రయిస్తానని ప్రచారం హోరెత్తించాడు. అంతే.. జనాలు ఒక్కసారిగా క్యూకట్టేశారు. దుకాణం ప్రారంభం రోజున.. దుకాణం తెరువక ముందు చేపల కోసం క్యూకట్టేశారు. చేపలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు.

అయితే ఇలా కిలో చేపలు కేవలం ముందుగా వచ్చే 100 మందికి మాత్రమేనని చెప్పడంతో రూపాయికే చేపలను దక్కించుకునేందుకు తెల్లవారుజామూ నుంచే కస్టమర్లు క్యూలలో నిల్చున్నారు. తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడిలో తన చేపల దుకాణం గురించి అందరికీ తెలిసేందుకు ఇలా చేశాడు వ్యాపారి. కేవలం ప్రచారం కోసమేనా.. అంటే కాదు.. తన వద్ద తాజా చేపలు లభ్యమవుతాయని.. వాటిని అస్వాధిస్తే మంచి అరోగ్యం కూడా సిద్దిస్తుందని వ్యాపారి బదులిచ్చాడు.

తొలి వందమందికి రూపాయికే కిలో చేపలు ఇవ్వనున్నట్టు చేసిన ప్రచారం ఆయనకు విపరీతంగా కలిసి వచ్చింది. జనం ఎగబడడంతో తన ప్రయోగం ఫలించిందని వ్యాపారి చెప్పుకొచ్చాడు. తన షాపునకు విపరీతమైన ప్రచారం లభించిందని ఆనందం వ్యక్తం చేశాడు. రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న బామ్మే తనకు ఆదర్శమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. మరోవైపు, ఆయన వద్ద చేపలు కొన్న జనం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles