BJP poaching our MLAs: Congress బీజేపి మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోంది: కాంగ్రెస్

Bjp shiv sena broke trust of maharashtra voters congress nitin raut

BJP, Shiv Sena, Maharashtra government formation, Devendra Fadnavis, Adithya Thackeray, Uddhav Thackeray, Sharad Pawar, Congress, poaching MLA, Hussain dalwai, Nitin Raut, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

BJP and Shiv Sena have betrayed the voters by indulging in a tussle and not forming the government in the state said Congress. It further stated that BJP is trying to poach MLAs from other parties. There were reports that some Congress MLAs were approached by BJP leaders with money.

ప్రజాతీర్పుపై బీజేపి, శివసేనల విశ్వాసఘాతుకం: కాంగ్రెస్ విమర్శ

Posted: 11/08/2019 02:36 PM IST
Bjp shiv sena broke trust of maharashtra voters congress nitin raut

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడుస్తున్నా.. నూతన ప్రభుత్వం ఏర్పాటులో బీజేపి, దాని మిత్రపక్షమైన శివసేన పార్టీలు బెట్టు వీడకపోవడంతో పీఠముడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు మహారాష్ట్ర ఓటర్లు ఇచ్చిన ప్రజాతీర్పును శిరసావహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిపోయి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పును వమ్ము చేస్తున్నారని ఆ పార్టీ నేత నితిన్ రౌత్ విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక అర్హతే లేదని మండిపడ్డారు.

శివసేన, బీజేపి కూటమికి ప్రజలు అధికారం అందిస్తే వారు ప్రజల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు రెండు పార్టీలు రాష్ట్ర అభివృద్దికి తాము పాటుపడతామని, రైతు సమస్యలను పరిష్కారిస్తామని హామి ఇచ్చారని, ప్రస్తుతం పక్షం రోజుల నుంచి అధికార దాహంతో అల్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇది మహారాష్ట్ర ప్రజాతీర్పును అవమానించడమేనని అన్నారు. పక్షం రోజులుగా ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని అన్నారు.
 
కాగా ఎమ్మెల్యేల కోసం బేరసారాలు సాగుతున్నట్టు శివసేన చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేనే స్వయంగా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆందోళన చెందుతోంది. బీజేపీ నైతికంగా ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతోంది. అందుకే వారి నుంచి మహారాష్ట్రను కాపాడాలి. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక హక్కు మహాయుతికి (బీజేపీ + శివసేన కూటమి) ఉందా?’’ అని కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేల్ని జైపూర్‌కు తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ సభ్యులకు డబ్బు ఇవ్వజూపేందుకు బీజేపి యత్నిస్తోందన్న సమాచారం అందిందని.. అందుకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే తమ ఎమ్మెల్యేలకు బీజేపి ఎరవేసే అవకాశమే లేదని కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్‌ దళ్వాయి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించిన కొందరు నేతలు తిరిగి రావాలని యోచిస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఎన్‌సీపీతో కలిసే తీసుకుంటుందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Shiv Sena  Devendra Fadnavis  Hussain Dalwai  Nitin Raut  Sharad Pawar  Congress  NCP  Maharashtra  Politics  

Other Articles