JC alleges CM Jagan targeting selected people వ్యక్తులను ఎంచుకుని కేసులు.. వైసీపీ సర్కార్ పై జేసీ ఆరోపణలు

Cm jagan is targeting select people senior leader jc diwarkar reddy

JC sensational comments on AP Government, JC sensational comments on YSRCP Government, JC Diwakar Reddy sensational comments on Jagan Government, CM YS Jagan, AP CM, YS Jagan Mohan Reddy, Ananthapur, YCP Government, JC Diwakar Reddy, YS Jagan, YSRCP, TDP, Ananthapur, YS Jagan Government, Andhra Pradesh, Politics

Former TDP MP JC Diwakar Reddy has alleged that CM YS Jagan is targeting selected people. Diwakar gave a contradictory statement by saying he was not aware as to whether Jagan Mohan Reddy was aware of people being targeted. He stated that 80 buses belong to him were seized and cases were filed.

ITEMVIDEOS: వ్యక్తులను ఎంచుకుని కేసులు.. వైసీపీ సర్కార్ పై జేసీ ఆరోపణలు

Posted: 11/07/2019 04:04 PM IST
Cm jagan is targeting select people senior leader jc diwarkar reddy

సీనియర్‌ నాయకుడు, అనంతపురం జిల్లా టీడీపీ ప్రతినిధి జె.సి.దివాకర్‌రెడ్డి జగన్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని వైఎస్సార్ ప్రభుత్వం తమ ప్రత్యర్థులను ఎంచుకుని మరీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. అన్ని వైపుల నుంచి అష్టదిగ్భంధనం చేసి బలమైన ప్రత్యర్థులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఒత్తిడి తీసుకువస్తుందని మండిపడ్డారు. మనుషులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. ఒత్తిడులను పెంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేయడమే ఈ కేసుల ప్రధాన ఉద్దేశమని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభమైన ఈ ఒత్తిళ్లు భవిష్యత్తులో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు సీజ్‌ చేయడం కూడా ఇందులో భాగమేనన్నారు. నిర్ధేశిత సమయంలో కన్నా ఆలస్యంగా నడుస్తున్నాయని బస్సులను సీజ్ చేస్తారా.? కానీ ఇక్కడ జరుగుతుందందేనన్న జేసీ.. వ్యాపారంపై దెబ్బకోట్టి.. ఆదాయ వనరులు లేకుండా చేయడం వెనుక పరమార్థం ఒక్కటేనన్నారు. ఎంచుకున్నవారిని కేసుల పేరుతో అందోళనకు గురిచేసి తమ పార్టీలో కలుపుకునేందుకనే అరోపించారు.

తాము దశాబ్దాలుగా రవాణా వ్యాపారంలో తాను ఉన్నానని, నిబంధనలు అతిక్రమించిన సందర్భాలు ఎప్పుడూ లేవని అన్నారు. అయినా మా బస్సులు సీజ్‌ చేస్తున్నారంటే లక్ష్యం మేరకేనన్నారు. లేదంటే మిగిలిన సంస్థల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారని చెప్పారు. ట్రిబ్యునల్‌ బస్సులను విడుదల చేయాలని చెప్పినా రవాణా శాఖ అధికారులు వదలడం లేదన్నారు. సీఎస్‌ లాంటి ఉన్నత స్థాయి అధికారిపైనే వేటు వేసిన ప్రభుత్వం తమనేం చేస్తుందో అన్న భయం వల్లే అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  YS Jagan  YSRCP  TDP  YS Jagan Mohan Reddy  Ananthapur  YCP Government  Andhra Pradesh  Politics  

Other Articles