No Ayyappa Deeksha for cops on duty అయ్యప్ప దీక్షను అనుమతించేది లేదు: మహేశ్ భగవత్

No ayyappa deeksha for cops on duty rachakonda cp

Ayyappa swamy deeksha, police constables, Mahesh Bagawat, police commissioner, rachakonda, CM KCR, Mahender Reddy, DGP, cops, hyderabad, mahesh m. bhagwat, police commissioner, sabarimala, Telangana, Politics

Rachakonda Police Commissioner Mahesh M Bhagwat issued an internal circular memo denying exemption in the prescribed uniform to police personnel in Rachakonda who want to take ‘Ayyappa Deeksha’.

అయ్యప్ప దీక్షను అనుమతి లేదు.. సెలవు పెట్టుకోండీ: మహేశ్ భగవత్

Posted: 11/06/2019 01:17 PM IST
No ayyappa deeksha for cops on duty rachakonda cp

అయ్యప్ప దీక్ష చేపట్టి మాలాధారణ కార్యక్రమాలతో శబరిమల వెళ్లి వచ్చేందుకు పోలీసు విభాగంలోని అనేక మంది వివిధ స్థాయిల్లోని పోలీసులు కూడా ఆసక్తి కనబరుస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేపట్టాలని భావించే పోలీసు విభాగానికి చెందిన సిబ్బందికి, అధికారులకు పోలీసు ఉన్నతాధికారులు షాకిచ్చారు. అయ్యప్ప దీక్ష స్వీకరించే కానిస్టేబుళ్లు విధుల్లో తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందేనని.. నల్లని దుస్తులతో విధులు నిర్వహించేందుకు ఎలాంటి అవకాశం కల్పించడం కుదరదని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు.

అలాకాకుండా తాము దీక్ష చేపట్టామని.. ఎలాగైనా శబరిమలకు వెళ్లి రావాల్సిందేనని భావించే పోలీసులు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందేనన్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అయ్యప్ప దీక్ష సమయంలో పోలీసు సిబ్బంది ఆచరించే నియమాల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటారు. ఇందుకు సంబంధించి కమిషనరేట్‌ పరిధిలోని ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీస్‌ సిబ్బంది అధికారుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
 
వాటన్నింటిని పరిశీలించిన సీపీ మహేష్‌ భగవత్‌ ప్రధాన కార్యాలయం జారీ చేసిన మెమో నెం. 987/ఈ3/2011 ప్రకారం యూనిఫాం, షూ లేకుండా పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహించడం కుదరదన్నారు. అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్‌ శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదన్నారు. పోలీస్‌ సిబ్బంది గడ్డాలు, మీసాలు పెంచి విధులు నిర్వహించడం కుదరదని చెప్పారు. అవసరమైన వారు రెండు నెలలపాటు సెలవుతీసుకుని దీక్ష చేపట్టవచ్చని పేర్కొన్నారు ఈ తరహా అనుమతులకు సంబంధించి వచ్చే విజ్ఞప్తుల్ని సీపీ కార్యాలయానికి పంపవద్దని డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలకు సీపీ మహేష్‌ భగవత్‌ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles