TSRTC Strike: no impact of CM KCR Deadline సీఎం పిలుపుకు టీఎస్ఆర్టీసీలో స్పందన కరువు..

Tsrtc strike 16 members report at depo amid closure of cm deadline

TSRTC Workers, TSRTC Strike, RTC Drivers, RTC conductors, RTC Mechanics, RTC Record tracer, RTC Assistant managers, CM KCR deadline, High Court, workers apology, RTC employees apologize, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

The TSRTC drivers, conductors, and other staff are continuing their strike demanding RTC merge in the government since 32 days. Telangana CM KCR had issued deadline 3 days ago but seeks no responce from RTC staff and Employees.

టీఎస్ఆర్టీసీ సమ్మె: సీఎం పిలుపుకు బెదరని కార్మికులు.. స్పందన కరువు..

Posted: 11/05/2019 05:05 PM IST
Tsrtc strike 16 members report at depo amid closure of cm deadline

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నారు. గత నెల 2వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులు ఇవాళ్టికి 32 రోజులుగా సమ్మెలో పాల్గోంటున్నారు. తమ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. కాగా ఇవాళ సాయంత్రంలోగా ఆర్టీసీ కార్మికులు సమీపంలోని బస్ డిఫోల వద్ద రిపోర్టు చేసిన పక్షంలో వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా వుండబోదని లేని పక్షంలో ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వానిది బాధ్యత కాదని తేల్చిచెబుతోంది.

సమ్మెను కఠినంగా అణచి వేయాలనే ఉద్ధేశం మాకు లేదు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. మేం చెడగొట్టుకుంటాం. అలాగే పోతాం అంటే ప్రభుత్వం కూడా చేయగలిగిందేమీ లేదు’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి అందునా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచే డెడ్ లైన్ వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల్లో విచ్ఛిన్నం వస్తుందని.. కనీసం వందల మంది కార్మికులు ఆర్టీసీలో చేరుతారని రాష్ట్ర ప్రజానీకం భావించారు. అయితే కేసీఆర్ డెడ్ లైన్‌తో ఇప్పటి వరకూ పట్టుమని పదహారు మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. వారిలో 4 డ్రైవర్లు, కండక్టర్లు, 6 అసిస్టెంట్ మేనేజర్లు, 1 రికార్డు ట్రేసర్, మెకానిక్ ఉన్నారు. కాగా కేసీఆర్ విధించిన డెడ్‌లైన్ రేపు అనగా మంగళవారం అర్ధరాత్రితో ముగియనుంది.

ఈ తరుణంలో స్పందించిన ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశాంతంగా ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. మానసిక అందోళనకు గురైయ్యేలా వారిని ప్రేరేపిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. కార్మికులను భయాందోళనకు గురిచేసే పధ్దతి మానుకుని ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బోర్డు అనుమతి తప్పనిసరన్నారు. ఇక కార్పొరేషన్‌ను మార్చాలంటే రాష్ట్రానికి కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆర్టీసీ కార్మికులు భయపడాల్సిన అవసరంలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ డెడ్‌లైన్లను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. తమ పట్ల ఎంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ఈ విషయాలు తెలిసినా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కార్మికులను మానసిక వేదనకు గురిచేసేందుకు యత్నిస్తోందని అశ్వద్దామరెడ్డి అన్నారు.

ఆర్టీసీ కార్మికులను తూలనాడిన టీఆర్ఎస్ నేత..

సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను భద్రాచలం టీఆర్ఎస్ నేత మామిడి పుల్లారావు అసభ్య పదజాలంతో దూషించారు. మహిళలు అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాచలం డిపో వద్దకు చేరుకున్న ఆయన ఆర్టీసీ కార్మికుల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్మికులంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. పుల్లారావును చుట్టుముట్టి కార్మికులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పుల్లారావును తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసు వాహనాన్ని కార్మికులు చుట్టుముట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఎలాగోలా పుల్లారావును ఆటోలో స్టేషన్‌కు తరలించారు. తమను అభ్యంతరకర రీతిలో దూషించిన టీఆర్ఎస్ నేత పుల్లారావుపై పోలీసులకు ఆర్టీసీ కార్మికులు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles