AP Chief Secretary LV Subrahmanyam transferred ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ..

Andhra pradesh chief secretary lv subrahmanyam transferred

LV Subrahmanyam, Chief secretary, Transffered, Director General, AP Human Resources Development Institute, Praveen Prakash, Principal Secretary, YS Jagan, Chief Minister, Andhra Pradesh, Politics

Chief Secretary of Andhra Pradesh LV Subrahmanyam was on Monday transferred and is now posted as Director General, AP Human Resources Development Institute, Bapatla. Praveen Prakash, Principal Secretary to the government (political) has issued the orders.

ఏడు నెలలు తిరగకుండానే ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ..

Posted: 11/04/2019 07:02 PM IST
Andhra pradesh chief secretary lv subrahmanyam transferred

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసింది. ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించింది.  ఎల్వీ సుబ్రహ్మణ్యంను మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేశారు. తక్షణమే విధుల నుంచి తప్పుకుని, నీరబ్ కుమార్ కు బాధ్యతలను అప్పగించాలని సుబ్రహ్మణ్యంకు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఎన్నికల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఆయనను బదిలీ చేయడం గమనార్హం.

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మార్పిడి అంశంలో చోటుచేసుకున్న వివాదమే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కారణమని తెలుస్తోంది. సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత వారం ఓ వివాదాస్పద జీవో రిలీజ్ చేశారు. దానిపై వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులు పంపారు. షోకాజ్ నోటీసులకు జవాబు చెప్పాల్సిన సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఏకంగా సీఎస్ నే బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసి సంచలనం సృష్టించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మరో ఐదు నెలలు సర్వీసు ఉంది. ఈ లోపే ఆయన సీఎస్ పోస్టు నుంచి బదిలీ కావడం అటు రాజకీయ వర్గాలను, ఇటు అధికార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

రాజకీయ కలకలం.. ఐవైఆర్ కృష్ణారావు ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికప్పుడు సీఎస్ ను బదిలీ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. సీఎస్ ను ఆయన కిందిస్థాయి అధికారి బదిలీ చేయడంపై కూడా వివాదాస్పదంగా మారుతోంది. ఈ వ్యవహార విషయమై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్, బీజేపి నేత ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి సీఎస్ ను తప్పించే అధికారం ఉన్నప్పటికీ... ఈ తొలగించిన విధానం సరిగా లేదని ఆయన అన్నారు.

అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై కూడా విమర్శలు చేశారు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇది బహుమనమైతే మరీ దారుణం అని కామెంట్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దాల్ మే కుచ్ కాలా హై అని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికోందరు ఆయన బీజేపీ నాయకుడు కావడం వల్లే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ఇక రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపైనా పవన్ స్పందించారు. ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తిని ఇప్పటికిప్పుడు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తెరవెనుక ఏదో జరిగిందని, అక్రమాలు జరిగినట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు.

టీడీపీ ఎంపీ కేశీనేని నాని కామెంట్స్:

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వం బదిలీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. "ఏపీ సీఎస్ ఓ అంశంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకంగా సీఎస్ నే బదిలీ చేశారు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ ట్వీట్ చేశారు.

టీడీపీ నేత వర్ల రామయ్య ఏమన్నారంటే:

మీ పుణ్యమా అని ఐఏఎస్ అధికారుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. "సీఎం గారూ మీ పరిపాలన అగమ్యగోచరంగా ఉంది. ఓ విషయంలో తన కిందిస్థాయి అధికారికి సీఎస్ షోకాజ్ నోటీసులు ఇస్తే ఆ కింది స్థాయి అధికారిని మీరు రక్షిస్తూ సీఎస్ నే బదిలీ చేశారు. పాలనా యంత్రాంగానికి మీరు ఇస్తున్న సందేశం ఏమిటి? గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏమి అవగాహన!" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆకస్మిక బదిలీ వ్యవహరం.. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చెప్పేవాటికి, చేసేవాటికి పొంతన లేదు. ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న వ్యక్తిని బదిలీ చేయడం నియంతృత్వం కాక మరేంటి? అని ప్రశ్నించారు.

టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఏమన్నారంటే..
 
ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించనందునే ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు. తన కన్నా కిందిస్థాయి అధికారి ఉన్నతాధికారిని బదిలీ చేస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేస్తారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సీఎస్ ఆకస్మిక బదిలీపై ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles