Pawan Kalyan gives 2 week deadline to AP Govt జగన్ సర్కారుకు జనసేన రెండు వారాల డెడ్ లైన్..

Pawan kalyan gives 2 week deadline to ap govt

Janasena, Pawan Kalyan, vishaka long march, pawan kalyan long march, janasena long march, building workers welfare fund, pawan kalyan deadline to government, pawan kalyan deadline to YSRCP government, pawan kalyan Long March deadline to government, Mangalagiri, Amaravati, andhra pradesh, politics

Jana Sena Party chief Pawan Kalyan gives 2 week time to YSRCP Government to resolve the sand scarcity issue and compensate the deceased families with RS 5 lakh and Rs 50,000 to each construction worker.

జగన్ సర్కారుకు జనసేన డెడ్ లైన్.. పరిహారం ప్రకటించాలి: పవన్ కల్యాణ్

Posted: 11/04/2019 12:23 PM IST
Pawan kalyan gives 2 week deadline to ap govt

అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ.. వారిని రోడ్డున పడేట్లు చేస్తొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక లభ్యత లేకపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతుందని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రగతి కూడా గణనీయంగా తగ్గిపోతుందని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా భవన నిర్మాణరంగాన్ని నమ్ముకుని బతుకుతున్న లక్షలాదిమంది కార్మికులు, కూలీలు జీవితాలతో ఈ సమస్య ముడిపడిందని ఆయన పేర్కోన్నారు. తమ రోజువారి కూలీలు, జీతాలు అందక ఈ రంగాన్ని నమ్ముకున్న పలువురు పేదలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చి ఆరునెలలుగా జీతాబెత్యాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇకపై జీతాలు తీసుకునే హక్కులేదని మండిపడ్డారు. రెండు వారాల వ్యవధిలో ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ఆయన.. ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా, ఉపాధిని కొల్పోయిన వారికి రూ.50 వేల పరిహారం అందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తామిచ్చిన గడువులోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో భనవనిర్మాణకార్మికులతో అమరావతికి వచ్చి అక్కడే తమ నిరసనను వ్యక్తం చేస్తామని పవన్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తనను ఎవరు ఆపుతారో చూస్తానని.. ఎంత మంది పోలీసులను పెట్టుకుంటారో చూద్దామని అన్నారు.

విశాఖపట్నంలో ఈ సాయంత్రం నిర్వహించిన లాంగ్ మార్చ్ లో పాల్గొన్న ఆయన.. బహిరంగ సభలో ప్రసంగిస్తూ నిప్పులు చెరిగారు. అమరావతిలో కూల్చివేతలతో ప్రారంభమైన ఈ వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని ధ్వజమెత్తారు జనసేనాని. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే రెండు వారాల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు పవన్ కల్యాణ్. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల కోసం విపక్షాలన్నీ కలిసి పోరాటం చేస్తున్నాయని.. భవన నిర్మాణ కార్మికుల కోసం అఖిలపక్షం కదలిరావాలని సూచించారు. కుల రాజకీయాలను పక్కన బెట్టి కార్మికుల పక్షాన పోరాడదామని పిలుపునిచ్చారు.

‘‘ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. రోడ్ల మీదకు రావడం నాకు సరదాకాదు. ఆరు నెలల్లోనే జగన్ ప్రభుత్వం విఫలమైంది. భవన నిర్మాణ కార్మికుల బాధలను చూడలేకే ఈ లాంగ్ మార్చ్‌ నిర్వహించాం. 26 మంది కార్మికులు చనిపోవడం బాధాకరం. ఇసుక లేకుంటే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుంది. నాకు శ్రామికుడి కష్టం, ఆవేదన తెలుసు. భవన నిర్మాణ కార్మికుల బాధలు నా గుండెను తాకాయి. తట్టలు మోసి మోసి ఆలసిసోలసిన వెన్నుపై ప్రభుత్వం పోటేవేసింది. భవన నిర్మాణ కార్మికులు లేకుంటే ఈ బిల్డింగ్ లు ఎక్కడివి. నిర్మాణం ఆగిపోతే ఎంత అభివృద్ధి ఆగిపోతుందో వైసీపీ నేతలకు తెలియడం లేదని దీని ప్రభావం రాష్ట్రంపై కూడా పడతుందని’’ ఆయన అందోళన వ్యక్తం చేశారు.

ఇక పనిలో పనిగా వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. ‘‘సూట్ కేసు కంపెనీలు పెట్టే రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా నన్ను విమర్శించే దౌర్భాగ్య స్థితి నెలకొంది. మేం ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా..? కాన్షీరాం, అంబేద్కర్ లాంటి వాళ్లు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. వారి స్ఫూర్తితోనే ముందుకెళ్తా. రెండున్నరేళ్లు జైల్లో ఉన్న వీళ్లా నా గురించి మాట్లాడేది. వీళ్లు మా నాయకులు కావడం మన దురదృష్టం. మీరు పరిధి దాటి మాట్లాడితే తాట తీస్తాం. నా డీఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఎవరికుంది? ఏ డీఎన్‌ఏ అని మీ అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచారు. ఈ రోజు 151 సీట్లు గెలిచారని కళ్లు నెత్తికెక్కాయా? ప్రజల కోసం పోరాడితే ఆర్మీ వచ్చినా ఆపేది లేదు. అలాంటిది వీళ్లెంత.. వీళ్ల సత్తా ఏంత?’’ అంటూ నిప్పులు చెరిగారు.

తనకు దత్తపుత్రుడు అని, బి-టీమ్ అని పేర్లు పెట్టారని, వాళ్లకు బలమైన సమాధానం చెబుతానని అన్నారు. తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడ్నని అన్నారు. తాను డబ్బుతో పార్టీ నడపడంలేదని, నికార్సయిన భావజాలంతో పార్టీ నడుపుతున్నానని స్పష్టం చేశారు. ఇవాళ ఇంతమంది వచ్చారంటే ప్రజల్లో ఎంత ఆవేదన ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానన్నారు. తనకు ఇదంతా అవసరంలేదని అన్నారు. సగటు రాజకీయ నాయకుడు బాధ్యతగా ఉండుంటే తాను జనసేన పార్టీ పెట్టేవాడ్నే కాదన్నారు. ఏవో నాలుగు పుస్తకాలు చదువుకుంటూ ఇంటివద్దే ఉండేవాడ్నని అన్నారు.

సగటు రాజకీయనాయకుల విధివిధానాలు ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే సామాన్యుల్లోంచి వచ్చే నాయకులు పుడతారు. ఆ విధంగానే నేను వచ్చాను తప్ప రాజకీయాలేం నాకు సరదా కాదు. మీ పాలిసీలు సరిగా లేనప్పుడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు. వర్షాలు, వరదలు వచ్చినందుకు ఇసుక తీయలేమంటున్నారు. ఇంతకు ముందు వర్షాలు రాలేదా? జగన్ అధికారంలోకి రాగానే వర్షాలు వస్తున్నాయా? మిగతా రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. మరి అక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎందుకు చనిపోవడం లేదు? అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  Long march  deadline  YSRCP Government  vishakapatnam  andhra pradesh  politics  

Other Articles