8 killed as Andhra tourist bus falls in gorge తూగోలో ఘెర రోడ్డుప్రమాదం.. 8 మంది మృతి..

Eight dead after tourist bus falls into tribal area valley in andhra pradesh

east godavari accident, Chintoor ghat, East Godavari, road accident, valley, Valmiki Konda, Andhra pradesh. Crime

As many as 8 people died after a private tourist bus fell into a valley in the tribal area in East Godavari district in Andhra Pradesh on Tuesday, police said.

తూగోలో ఘెర రోడ్డుప్రమాదం.. 8 మంది మృతి..

Posted: 10/15/2019 03:05 PM IST
Eight dead after tourist bus falls into tribal area valley in andhra pradesh

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాది రామయ్యను దర్శించుకుని అక్కడి నుంచి అన్నవరం సత్యదేవుడిని దర్శించుకునేందుకు బయల్ధేరిన ఆ భక్తజన బృందానికి ఈ యాత్రే ఆఖరి యాత్రగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనం మార్గమధ్యంలో అదుపుతప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో అధికులు తిరిగిరానిలోకాలకు తరలివెళ్లారు.

ఈ ఘటన మారేడుమిల్లి - చింతూరు మధ్య సంభవించింది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో మొత్తం ఎనమిది మంది దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

కాగా మరోకరు అస్పత్రిలో చికిత్స పోందుతూ మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టెంపో మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

పర్యాటకులంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లాలోని చెలకెరి గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రహదారిపై వాహనం అదుపుతప్పి ప్రమాదం సంభించిందా.? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles