మెగాస్టార్ చిరంజీవి చిత్రం రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా వున్న ఈ నేత తాజాగా మళ్లీ రాజకీయ నేతలతో సమవేశం అవుతున్నారు. తన రాజకీయ జీవితం ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో.. ఆయన తన సహనటులైన రజనీకాంత్, కమల్ హాసన్ లకు కూడా రాజకీయాలకు దూరంగా వుండాలని సూచించారు. రాజకీయాల్లో అనుకున్నంత ప్రజాసేవ చేయలేమని, అంతకంటే సినీజీవితంతో పాటు సాధ్యమైనంత ప్రజాసేవ చేయడమే మేలని కూడా పేర్కోన్న విషయం తెలిసిందే.
అలాంటి చిరంజీవి తాజాగా రాజకీయ నేతలతో సమావేశం అవుతూ బిజీగా మారుతున్నారు. క్రితం రోజున తన కుటుంబసభ్యులతో తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న చిరంజీవి.. సీఎం జగన్ తో సమావేశమైన ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కూడా కలవనున్నారు. అయితే ఈ భేటీ ఎప్పుడు వుండే అవకాశం వుందన్న విషయాలు ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ లభ్యతను బట్టి తెలుస్తుందని సమాచారం.
అయితే బుధవారం రోజు చిరంజీవి సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. హస్తిన వెళ్లున్న ఈ మాజీ కేంద్రమంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. దేశ స్వతంత్ర సంగ్రామ తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాను చూడమని చిరంజీవి వెంకయ్య నాయుడుని అడిగే అవకాశం ఉంది.
అనంతరం ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం కూడా చిరంజీవి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. ఆయన అపాయింట్ మెంట్ కూడా దొరికితే మోడీని కూడా కలసే అవకాశం ఉంది. అయితే మోడీతోపాటు గంటా శ్రీనివాస్ కూడా మోడీని కలిసే అవకాశం ఉందని తెలుస్తుండగా.. వీరి భేటికి రాజకీయ ప్రాధన్యత ఉందా? అనే విషయమై ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా కేవలం నటుడిగానే చిరంజీవి ప్రధానితో భేటీ అవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఆకట్టుకోగా, ఆయన నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మళయాల భాషల్లో సినిమా విడుదలైన ఈ చిత్రానికి తెలుగువారిన నుంచి వచ్చిన స్పందన.. మిగతా బాషల్లో అశించిన మేర రావడం లేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more