Janasena extends support to TSRTC strike ఆర్టీసీ జేఏసీ తెలంగాణ బంద్ కు పవన్ కల్యాణ్ మద్దతు

Tsrtc strike pawan kalyan extends support to jac bandh

TSRTC strike, pawan kalyan, janasena, telangana bandh, tsrtc jac, janasena tsrtc, janasena telenagna bandh, pawan kalayan srinivas reddy, pawan kalyan surender goud, Tsrtc employees strike, tsrtc staff strike, tsrtc employees termination, TSRTC, TSRTC Workers, tsrtc workers strike, ts government

Extending the party's support to the strike called by the RTC unions, Janasena chief Pawan Kalyan asked the Telangana government to understand their wows and hold talks with the RTC unions.

ఆర్టీసీ జేఏసీ తెలంగాణ బంద్ కు పవన్ కల్యాణ్ మద్దతు

Posted: 10/14/2019 03:03 PM IST
Tsrtc strike pawan kalyan extends support to jac bandh

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వానికి ఇదివరకే సమ్మెపై స్పందించిన పవన్.. కార్మికుల డిమాండ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి.. వారి జీవితాలకు భరోసా కల్పించాలని, అటు ప్రయాణికులు ఎదుర్కోంటున్న ఇబ్బందులను కూడా నివారించాలని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం అర్టీసీ కార్మికుల విషయంలో పట్టుదలకు పోతుంది.

అర్టీసీలో పనిచేస్తున్న 48వేల మంది కార్మికులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుని.. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల భర్తీకి నోటిషికేషన్ కూడా విడుదల చేసింది. దీనిపై స్పందించిన పవన్ కార్మికులను ఉద్యోగాల నుంచి తోలగించడం సమస్యకు పరిష్కారం కాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కూడా సూచించారు. అయినా ప్రభుత్వం మాత్రం తమ బెట్టును వీడకుండా నోటిఫికేషన్ విడుదల చేసి.. వారికి తాత్కాలిక ప్రాతిపదికన రోజుకు వెయ్యి రూపాయాల జీతాన్ని ఇస్తామని కూడా ప్రధానంగా ప్రకటించింది. దీంతో కార్మిక సంఘాల జేఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 19న బంద్ నిర్వహిస్తున్నారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చిందని... కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలని జనసేన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్‌లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరమని జనసేన వ్యాఖ్యానించింది. వారిని ప్రభుత్వం తిరిగి తెచ్చివ్వగలదా.? అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం తరువాత అంతటి పెద్ద ఉద్యమంలా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని పార్టీ ప్రకటనలో తెలిపింది. 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన రేకెత్తిస్తుందని జనసేన అభిప్రాయపడింది. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అనే ఆందోళన అందరిలో కలిగిందని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్చించాలని... సమ్మె మరింత ఉధృతం కాకుండా పరిష్కరించాలని జనసేన కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Srike  pawan kalyan  janasena  telangana bandh  tsrtc union jac  Telangana  politics  

Other Articles