TSRTC strike enters 10th day ఢిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన

Tsrtc workers continue their indefinite strike on 10th day

TSRTC Workers Telangana movement, TSRTC dhoom dhaam, TSRTC vanta varpu, TSRTC bike rally, TSRTC manava haram, TSRTC employees rally, TSRTC public meetings, TSRTC movement in telanagana movement style, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

The indefinite strike by unions of Telangana State Road Transport Corporation (TSRTC) continued for the tenth day on Monday even as a bandh was being observed in Khammam district following the death of a driver. D Srinivas Reddy,

ఆర్టీసీ సమ్మె: ఢిపోల ఎదుట కుటుంబసభ్యులతో కార్మికుల నిరసన

Posted: 10/14/2019 01:25 PM IST
Tsrtc workers continue their indefinite strike on 10th day

ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తామన్న అర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు పదో రోజున కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు కార్మికులు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్ ను తొలుత పరిష్కరించాలని కార్మికులు నినదిస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించాలని ఉద్యమబాటలో ముందుకు వెళ్తున్న కార్మికులు.. తెలంగాణ ఉద్యమ పంథాలోనే సమ్మెను కొనసాగిస్తున్నారు.

సమ్మెను ఉద్యమబాటలో ముందుకు తీసుకెళ్తున్న కార్మికులు జేఏసీ పిలుపుమేరకు ఇవాళ అర్టీసీ డిపోల ఎదుట తమ కుటుంబసభ్యులతో కలసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 5 నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. పలు దశలుగా నిరసనలు చేపడుతున్నారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట భైఠాయించారు.

ఆర్టీసీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. వారి పిల్లలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని నిరసనకు మద్దతు పలికారు. రాజధాని నగరంలోని ముషిరాబాద్ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాసరెడ్డి, కండక్టర్ సురేంద్రగౌడ్‌ల ఫొటోలకు నివాళులర్పించారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం బస్ డిపో ఎదుట కార్మక సంఘాలు నేతలు ఆందోళనకు దిగారు.

సమ్మెకు మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్ లోని బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు బస్ భవన్ చేరుకున్న విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాధం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రి అహంకార ధోరణిని విమర్శిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోలేని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం ఎందుకని నిలదీశారు.

అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతర డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు. సమ్మెను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్టోబర్ 06వ తేదీన సాయంత్రం వరకు విధులకు హాజరు కాని వారి ఉద్యోగాలు తీసేసినట్లు, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియామకాలు చేపట్టింది. వంద శాతం బస్సులను రోడ్లపైకి తీసుకరావాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles