case on conductors if collects more the ticket price అధిక ధర వసూలు చేస్తే.. కండక్టర్లపై చీటింగ్ కేసులు..

Tsrtc strike police cases on conductors for exorting money from passengers

temporary conductors, cheating case, extra fare, ticket price, TSRTC strike, Tsrtc employees strike, tsrtc staff strike, tsrtc employees termination, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Strong Warning To CM KCR, CM KCR, Warning To CM KCR, tsrtc workers strike, ts government

Telangana Government warns temporary conductors of cheating case against them, if founded extracting even a single rupee extra from passengers in lieu of TSRTC employees strike.

అధిక ధర వసూలు చేస్తే.. కండక్టర్లపై చీటింగ్ కేసులు..

Posted: 10/11/2019 01:36 PM IST
Tsrtc strike police cases on conductors for exorting money from passengers

తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వుండేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపుతుండగా, ప్రైవేటు వాహనదారులకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అదెలా అంటే సమ్మెట పోటుతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారికి కొంత ఊరట కల్పించేందుకు అర్టీసితో అగ్రీమెంటు చేసుకున్న ప్రైవేటు బస్సులు నడిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

సమ్మెతో తాత్కాలిక కండర్టర్లు టికెట్లు ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి డబ్బును వసూలు చేస్తున్నారు. అసలు ఆ మార్గంలో వెళితే టికెట్ ధరగా ఎంత డబ్బు వసూలు చేస్తారో కూడా తెలియకుండానే బస్సునెక్కి కండక్టర్ల అవతారమెత్తి.. తమ జేబులు నింపుకుంటున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో గత్యంతరం లేక బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణీకుల నుంచి తమ ఇష్టమొచ్చినట్టుగా ఛార్జీల రూపంలో డబ్బులను దండుకుంటున్నారు. అయితే ప్రయాణికుల నుంచి ఈ మేరకు అనేక పిర్యాదులు వెల్లువెత్తడంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

అందిులో బాగంగా ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే తాత్కాలిక కండక్టర్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. నల్గొండ ఎస్పీ రంగనాథ్.. నార్కట్ పల్లి బస్టాండ్ లో బస్సుల రాకపోకలను పరిశీలించారు. ఎంత ఛార్జీ తీసుకుంటున్నారని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అసలు ధర కంటే ఎక్కువగా వసూలు చేశారని ప్రయాణికులు చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

యాదగిరిగుట్ట డిపోకు చెందిన రామాంజనేయులు అనే తాత్కాలిక కండక్టర్‌ను విధుల నుంచి తొలగించింది. అతడిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఎస్పీ ఏవి రంగనాథ్ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదు చేశారు. భువనగిరి నుంచి నల్గొండ వెళ్లే బస్సులో అసలు టికెట్ ధర రూ.65. కాగా ఒక్కో ప్రయాణికుడి దగ్గర రూ.75 వసూలు చేశారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులోనూ అధిక ఛార్జీలు వసూలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం పోలీసులను సాయంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Srike  temporary conductors  cheating case  extra fare  ticket price  Telangana  

Other Articles