Tirumala Srivaru on Garuda vahanam తిరుమల బ్రహ్మోత్సవాలు: గరుడ వాహనంపై శ్రీవారు

Tirumala bramhostavam srivari garuda vahana seva

tirumala,tirumala brahmotsavam, garuda vahana seva, kalpavrusha vahanam, sarva bhoopala vahanam, chinna shesha vahanam, hamsa vahanam. tirumala tirupati devasthanams, tirumala srivari brahmotsavam 2019, srivari brahmotsavam 2019, tirumala srivari brahmotsavam, brahmotsavam, srivari brahmotsavam, tirumala brahmotsavam 2019

The main attraction of the morning and evening Vahana sevas is the nine-day sevas during the annual Brahmotsavas of Srivaru at Tirumala. Garuda vahana seva will be held today.

తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి గరుడ వాహన సేవ

Posted: 10/04/2019 10:52 AM IST
Tirumala bramhostavam srivari garuda vahana seva

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకునిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరి కొలిచిన వారికి కొంగు బంగారమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేతుడై మలయ్యప్ప స్వామి విహరిస్తూ భక్తులకు అభయ ప్రధానం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల భక్త జనంతో పోటెత్తుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజున స్వామివారు మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు.

ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగానూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. ముగ్ధమనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. కమనీయమైన శ్రీహరి రూపం జగత్‌ సమ్మోహనం. మోహినీ రూపం వర్ణనాతీతం. జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉంది. మాయా జగన్నాటక సూత్రధారి దేవదేవుడు. ప్రపంచమంతా మాయావిలాసమని, తన భక్తులు కానివారు మాయాధీనులు కాక తప్పదని గీతలో స్వామి చెప్పారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బ్రహ్మోత్సవాల ఐదవ రోజు దేవదేవుడికి కీలకమైన గరుడ వాహన సేవ జరగనుంది. స్వామి వారి వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతే కాదు సర్పదోష హరణం జరుగుతుందని , దివ్యమైన జ్ఞానం కలుగుతుందని ప్రశస్తి.

సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని , ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తారు . కాబట్టి, బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ విశిష్టత సంతరించుకుంది. వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది.

గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి నిత్యం మూల విరాట్ కు అలంకరించే అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను గరుడ సేవలో అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగుతాడు .ఆ గరుడ వాహనుడైన శ్రీనివాసుని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాడా విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శుక్రవారం, అక్టోబర్ 4న శ్రీవారికి గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. గరుడ సేవకు టీటీడీ సైతం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala brahmotsavam  mohini avataram  garuda vahana seva  tirumada streets  devotees  TTD  

Other Articles