BJP MP demand Bharat Ratna to PV Narsimha Rao కాంగ్రెస్ మాజీ ప్రధాని భారతరత్నకు అర్హుడు: బీజేపీ ఎంపీ

Subramanian swamy demand bharat ratna to pv narsimha rao

Bharat Ratna, BJP, PV Narasimharao, Subramanian Swamy, Congress, Indian Economy, former Prime Minister, ManMohan singha, India, Politics

BJP leader Subramanian Swamy on Monday advised prime minister Narendra Modi to develop a "temper" to listen to the unpleasant truth and stop "frightening" his government's economists, if he wants to drive the economy out of the crisis.

మాజీ ప్రధాని పీవి భారతరత్నకు అర్హుడు: బీజేపీ ఎంపీ

Posted: 10/01/2019 06:15 PM IST
Subramanian swamy demand bharat ratna to pv narsimha rao

భారత జాతికి మేలు చేసిన కాంగ్రెస్ నేతలను సొంతం చేసుకునే పనిలో పడ్డ కేంద్రంలోని అధికార బీజేపి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహానేత తొలి ఢిప్యూటీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభబాయ్ పటేల్ ను సొంతం చసుకుని ఆయన అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా నదీ తీరాన ఏర్పాటు చేసి తమ వాడిగా మార్చుకున్న బీజేపి ఇక తాజాగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కూడా తమవాడిగా ముద్రవేసుకునే ప్రయత్నం ప్రారంభించింది. అందుకు ఆనుగూణంగా బీజేపి సీనియర్ నేత, రాజ్యసబ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి చేత పావులు కదిపిస్తోంది.

‘భారతరత్న’కు అర్హుడని మాజీ ప్రధాని పివీ నరసింహారావు అన్ని విధాలా అర్హుడని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మన్మోహన్‌సింగ్‌ లాంటి ఆర్థిక నిపుణుడిని ఆర్థికమంత్రిగా ఎంచుకోవడం పీవీ వివేకానికి నిదర్శనమని ప్రశంసించారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి కంటే ఆర్థికమంత్రిగానే ఎక్కువ సంస్కరణలు తీసుకురాగలిగారని అన్నారు. దేశ అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ముందుకు నడిపారని ప్రశంసించారు.

అయితే, అర్థిక మంత్రిగా, ఆ రంగ నిపుణుడిగా ఇది మన్మోహన్‌సింగ్ తోనే సాధ్యమైనా.. ఆయనకు మాత్రం ఎలాంటి ప్రశంస దక్కనీయకుండా ఆ ఘనత మన్మోహన్ సింగ్ ది కాదని, ఆ క్రెడిట్ అంతా పీవీ నరసింహారావుకే చెందుతుందన్నారు. వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికైనా ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాల్సిందేనని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ముంబైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్థిక సంస్కరణలు తెచ్చి వదిలిపెట్టకుండా కశ్మీర్ మొత్తం మాదే అని తీర్మానించిన ఘనత కూడా పీవీదేనని సుబ్రహ్మణ్యస్వామి కొనియాడారు.

అసంపూర్తిగా మిగిలిన ఎజెండా పీవోకే స్వాధీనమే అని పీవీ నిర్భయంగా చెప్పారని గుర్తు చేశారు. కాగా, గత నెల 11న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ పీవీ ‘భారతరత్న’కు అర్హుడేనని అన్నారు.  బాబ్రీ మసీదు కింద ఓ ఆలయం ఉండేదన్న విషయం శాస్త్రీయంగా తేలితే ఆ ప్రాంతాన్ని తమ ప్రభుత్వం హిందువులకు ఇచ్చేస్తుందని సుప్రీంకోర్టుకు పీవీ తెలియజేశారని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles