Hope Fades For Chandrayaan 2's Lander చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ పై సన్నగిల్లిన ఆశలు

Hope fades for chandrayaan 2 s lander as lunar night set to fall today

vikram lander whereabouts, chandrayaan 2 hopes, ISRO chairman Shivan, PM Modi urges nation to back ISRO, Chandrayaan-2, PM Modi, Shivan, ISRO Chairman, Vikram lander, ground station, landing, foreign affairs, politics

Chandrayaan 2 Mission: Lander Vikram, with rover Pragyan housed inside it, lost communication with the ground station on September 7 during its final descent, just 2. 1 km above the lunar surface, minutes before the planned touch-down on the Moon.

చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ పై సన్నగిల్లిన ఆశలు

Posted: 09/21/2019 12:50 PM IST
Hope fades for chandrayaan 2 s lander as lunar night set to fall today

భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం కాస్తలో విఫలమైనా.. ఇస్రో శాస్తవేత్తలకు మాత్రం ఇంకా ఆశలు సజీవంగానే వున్నాయి. ఇప్పటికీ తాము చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ పనిచేస్తుందని, అయితే దాని నుంచి గ్రౌండ్ స్టేషన్ కు సమాచార సమన్వయం మాత్రమే కోల్పోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 14 రోజుల నిరీక్షణ, అన్వేషణ తరువాత కూడా విక్రమ్ ల్యాండర్ అచూకీ తెలియక పోవడంతో ఇక ఇప్పటికీ కథ ముగిసినట్టేనని భారతీయులు భావిస్తున్నారు.

అయితే 14 రోజల పాటు విక్రమ్ అచూకీ కోసం అవిశ్రాంత అన్వేషణ కొనాసాగించా.. వారిలో మాత్రం ఇంకా ఆశలు విఫలం కాలేదు. తమ శ్రమ వృధాకాదని, మరో 14 రోజుల తరువాత ఫలితం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ద్రయాన్‌-2లో భాగంగా జూలై 22న చంద్రునిపైకి భారత్‌ ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ అన్ని దశలు దాటుకుని విజయవంతంగా చంద్రుని సమీపంలోకి చేరింది. ఈనెల 7వ తేదీన చివరి ఘట్టమైన ల్యాండింగ్‌ ప్రక్రియలో చివరి నిమిషంలో విక్రమ్ నుంచి సాంకేతిక సమస్వయం గ్రౌండ్ స్టేషన్ కు తెలిగిపోయాయి.

దీంతో ల్యాండర్‌ను వెతికి పట్టుకుని చివరి సెకన్లలో చేజారిన విజయాన్ని చేజిక్కించుకునేందుకు, వైఫల్యాన్ని వెతికి పట్టుకునేందుకు ఇస్రో చేసిన ఏ ప్రయత్నం ఫలితం ఇవ్వలేదు. ఆర్బిటర్‌లోని కెమెరాల ద్వారా ఫొటోలు తీసిన శాస్త్రవేత్తలు ల్యాండర్‌ బలంగా చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టిందన్న నిర్ధారణకు వచ్చారు. విక్రమ్‌లోని 'ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ ప్రొగ్రామ్‌' లో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు.

కనీసం 200 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్‌ చంద్రుడిని ఢీకొట్టి నిర్వీర్యమైంది. వ్యోమనౌక బోల్తా కొట్టడంగాని, పక్కకు ఒరిగి పడిపోవడంగాని జరిగి ఉంటుందని, అందుకే కమ్యూనికేషన్‌ సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నారు. ఇక చంద్రుడిపై ఈరోజు ఉదయంతో లూనార్‌ పగలు ముగిసింది. దీంతో మరో 14 రోజులపాటు దక్షిణ ధ్రువంపై చీకటి పరుచుకుంటుంది. పైగా ఈ కాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 200 డిగ్రీలకు పైనే నమోదవుతాయి.

ఈ పరిస్థితులను తట్టుకునే శక్తి విక్రమ్‌ ల్యాండర్‌, అందులోని ప్రజ్ఞాన్‌ రోవర్‌లకు లేదు. దీంతో దీని కథ ముగిసినట్టే అన్నది పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయంగా తెలుస్తున్నా. ఇస్రోలోని కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మరో 14 రోజుల తరువాత తమ అన్వేషణ కొనసాగుతుందని, లూనార్‌ పగలు మొదలయ్యాక ఆర్బిటర్‌ కెమెరా నుంచి పరిశీలించి విక్రమ్‌ జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. అయితే ఇప్పటికే విక్రమ్ ల్యాండర్ నిర్వీర్యమై ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrayaan-2  Shivan  ISRO Chairman  Vikram lander  ground station  landing  moon south pole  

Other Articles