Man held for toppling pillars at Hampi సెల్ఫీ మోజులో కటకటాల పాలైన పర్యాటకుడు..

Tourist booked for accidentally damaging two pillars while taking photographs

Bengaluru man, Hampi pillars, 2 Hampi pillars, selfie, Vijaya Vittala temple, UNESCO World Heritage site, Ancient Monument and Archaeological Sites and Remains Act 1958, Ballari district, crime

In an incident which has recently come to light, a 45-year-old man was arrested in Hampi after he accidentally knocked down two stone pillars at the Vijaya Vittala temple, a UNESCO World Heritage site, while taking a selfie.

సెల్ఫీ మోజులో కటకటాల పాలైన పర్యాటకుడు..

Posted: 09/21/2019 11:12 AM IST
Tourist booked for accidentally damaging two pillars while taking photographs

అనువుగాని చోట అధికులమనరాదు అన్నది పాత పద్యం.. మారుతున్న కాలానికి అనుగూణంగా మార్పులు చేస్తూ ప్రస్తుతం.. అనువుగాని చోట సెల్ఫీలు తీసుకోరాదు అన్నదిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సెల్ఫీలో మోజులో ప్రాణాలను కొల్పోతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతుంది కాబట్టి. అయితే అదెలా అంటే కొందరు కోరి ప్రమాదాల అంచులకు వెళ్లడం కారణమైతే మరికోందరు అనుకోకుండా ప్రమాదాల్లో పడి ప్రాణాలను కొల్పోయి విగతజీవులుగా మారుతున్నారు.

తాజాగా ఈ సెల్ఫీ మోజులో పడిన ఓ యువకుడు తన వారికి దూరంగా వుండిపోయాడు. కొద్దిలో తన ప్రాణాపాయం నుంచి భయటపడిన యువకుడు.. కటకటాల పాలయ్యాడు. స్నేహితులతో కలిసి సరదాగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హంపికి చేరుకున్న అతడ్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి కటకటాల పాలుజేయగా.. అతని స్నేహితులు మాత్రం ఎలాగైనా అతడ్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

విషయం యువకుడి తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులు కూడా తెలియడంతో వారు అందోళన చెందుతున్నారు. ఇంతకీ పర్యాటక ప్రాంతంలో సెల్ఫీలు దిగడం నేరమా.? అసలు ఆ యువకుడ్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు.? ప్రాంతం కానీ ప్రాంతంలో పర్యాటకానికి వెళ్లి యువకుడు చిక్కులో ఎలా పడ్డాడు.? పోలీసులు అతడ్ని అదుపులోకి ఎందుకు తీసుకున్నారు.? తమ రాష్ట్రంలోని హంపిలో పోలీసులు రూల్స్ వేరుగా వున్నాయా.? అన్న ప్రశ్నలు వేధిస్తున్నాయా..?

అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన నాగరాజ్ (45) తన మిత్రులతో కలిసి హంపి సందర్శనకు వెళ్లాడు. అక్కడ చారిత్రక కట్టడాలను చూస్తూ ముచ్చటపడ్డాడు. విజయ విఠల ఆలయంలోని సాల మంటపాన్ని చూసి మైమరచిపోయాడు. అక్కడి స్తంభాల వద్ద సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడ్డాడు. ఓ స్తంభానికి ఆనుకుని సెల్ఫీ దిగుతుండగా అది కాస్తా నేలకూలింది. అది తగిలి మరో స్తంభం కూడా కిందపడింది. దీంతో అవాక్కవడం నాగరాజ్ వంతు అయింది.

అయితే, పెద్ద శబ్దంతో స్తంభాలు నేలకూలడంతో అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో నాగరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు స్తంభాలు పడిపోవడానికి కారణం నాగరాజే కారణం కావడంతో మిగతా వారిని వదిలిపెట్టారు.  

ఈ సందర్భంగా బళ్లారి ఎస్పీ సీకే బాబా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్తంభాలు ఉన్న ప్రాంతంలోని నేల వదులుగా మారిందని, నాగరాజ్ స్తంభంపై చేయి వేయగానే అది కిందపడిందని, ఈ క్రమంలో మరో స్తంభానికి తాకి అది కూడా కూలిందని తెలిపారు. అనుకోకుండా జరిగిన ఘటనే అయినప్పటికీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయక తప్పలేదని ఎస్పీ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hampi  Tourinst  UNESCO World Heritage site  vandalism  karnataka  crime  

Other Articles