Babul Supriyo 'heckled' at Jadavpur University కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం

I was beaten up my hair was pulled yet nothing was done babul supriyo

Students gheroa union minister, students gherao babul supriyo, student heckled babul supriyo, Jagdeep Dhankhar, Black flags shown to babul supriyo, jadavpur university students gheroa, union minister babul Supriyo, Students, heckled, Jagdeep Dhankhar, Black flags, jadavpur university, babul Supriyo, West Bengal governor

Union minister Babul Supriyo was shown black flags, heckled and beaten up by a section of students at Jadavpur University.

కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం

Posted: 09/20/2019 02:52 PM IST
I was beaten up my hair was pulled yet nothing was done babul supriyo

కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు పశ్చిమబెంగాల్ లో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన ఆయనను వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఘోరావ్ చేశాయి. కేంద్ర మంత్రికి నల్లజెండాలు చూపించి వెనక్కి వెళ్లిపోవాలంటూ కొంతమంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఏబీవీపి నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బాబుల్‌ సుప్రియోను వామపక్ష విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి,

సమావేశ ప్రాంగణంలోకి రాకుండానే దాదాపు గంటన్నర సేపు అడ్డుకున్నారు. అతికష్టంతో సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రిని తర్వాత బయటకు వెళ్లకుండా విద్యార్థులు చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. విషయం తెలుసుకన్న రాష్ట్ర గవర్నర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు, ఆయనతో పాటు సీఆరపీఎఫ్ బలగాలను కూడా అక్కడకు రప్పించారు, అయితే, యూనివర్సిటీ గేట్లు మూసివేసిన విద్యార్థులు సీఆర్పీఎఫ్ దళాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు గవర్నర్ జోక్యంతో పాటు అధ్యాపకులు, పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

ఈ ఘటనను గవర్నర్ కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఘటన అనంతరం కేంద్ర మంత్రి సుప్రియో మాట్లాడుతూ.. తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదన్నారు. పలువురు తనను అవహేళన చేశారని, నా జుట్టు పట్టుకుని లాగి నెట్టివేశారని కేంద్ర మంత్రి తెలిపారు. తమను తాము నక్సల్స్‌గా పేర్కొంటూ నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని బాబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర గవర్నర్‌ విశ్వవిద్యాలయానికి వచ్చారు.

మరోవైపు, గవర్నర్ చర్యలపై అధికార తృణమూల్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులను ఏ మాత్రం సంప్రదించకుండా గవర్నర్ నేరుగా జోక్యంచేసుకోవడం ఏంటని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వ తొత్తుగా గవర్నర్ వ్యహరిస్తున్నారని తృణమూల్ పార్టీ దుయ్యబట్టింది. ఇందులో తమ పార్టీ గానీ, పోలీసులు గానీ జోక్యం చేసుకోలేదని ఇది కేవలం బీజేపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న వివాదం మాత్రమేనంటూ ఉద్ఘాటించింది. అంతేకాదు, కేంద్ర మంత్రి పర్యటనపై ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, పోలీసులు సైతం యూనివర్సిటీ బయట వేచి ఉన్నారని ఆ పార్టీ నేత వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles