revanth vs uttam in telangana congress తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తమ్ వర్సెస్ రేవంత్..!

Revanth reddy vs uttam kumar reddy in telangana congress

malkajgiri mp, revanth reddy, sampath kumar, vasmi chander reddy, Pawan Kalyan, huzurnagar by poll, uttam kumar reddy,uttam padmavathi, chamala kiran reddy. Electricity, selfie, congress. TRS, Telangana, Politics

Amid famous for group politics in congress, the leaders say its democracy in the party, but now the working president of TPCC raises few questions where the democracy of the party is being questioned. Its just like Revanth vs Uttam in the party

తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తమ్ వర్సెస్ రేవంత్..!

Posted: 09/18/2019 04:35 PM IST
Revanth reddy vs uttam kumar reddy in telangana congress

హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి, పిసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య అంతరాన్ని పెంచుతుందా.? అంటే అవునే అన్నట్లు వున్నాయి రేవంత్ రెడ్డి తాజా సంచలన వ్యాఖ్యలు. హుజూర్ నగర్లో తాను పోటీ చేయడం లేదని.. చామల కిరణ్‌రెడ్డి పోటీ చేస్తాడని, ఆయనకు తాను కూడా మద్ధతిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్ధి పేరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని అలాంటప్పుడు పద్మావతి పేరు ఎలా ప్రకటిస్తారని రేవంత్ ప్రశ్నించారు.

అటు తెలంగాణ ప్రభుత్వంపైనా ఆయన విరుచుకుపడ్డారు. కనీసం 14 రోజుల చర్చ జరగకుండా ఆమోదించిన బడ్జెట్ చెల్లదని ఆయన అభిప్రాయపడ్డారు. శని, ఆదివారాల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ సభ పెట్టకూడదని రేవంత్ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో 30 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగేవని ఆయన గుర్తు చేశారు. అలాకాకుండా కేవలం 10 రోజులు బడ్జెట్‌పై చర్చ చెల్లదని రేవంత్ వ్యాఖ్యానించారు.

14 రోజుల కంటే తక్కువ బడ్జెట్ సమావేశాలు జరిగితే బడ్జెట్ చెల్లదన్న నిబంధన అసెంబ్లీ రూల్స్ బుక్ లో వుందన్న విషయాన్ని ఆయన లేవనెత్తారు. అన్ని పార్టీలు అంగీకరించినా నిబంధనలను అనుసరించాల్సిందేనని ఆయన గుర్తు చేశారు. విద్యుత్‌పై చర్చ జరిగితే.. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేరని ఇది సరికాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య హాట్ టాపిక్ గా వున్నవిషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

విద్యుత్ పై ప్రభుత్వం ఏకపాత్రాభినయం చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు సభలో లేకపోతే ఏం సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఆయన నిలదీశారు. కరెంట్ కొనుగోళ్ల అక్రమాలపై గవర్నర్ కు నివేదిక ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. సీఎల్పీలో తాను కూడా సభ్యుడినేనని గవర్నర్ అప్పాయింట్ మెంట్ పై సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. కాలేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్రమంత్రులు అరోపణలు చేస్తున్నారని, అయితే దానిపై విచారణకు మాత్రం వెనుకంజ వేస్తున్నారని అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి పిసిసీ, కమిటీ చైర్మన్ అనుమతితోనే తాను హాజరయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. మరి, పవన్ కల్యాణ్ మీటింగ్‌కు సంపత్, వంశీ ఎందుకు వచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. జనసేన మీటింగుకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నించేవాళ్లే అక్కడికి వచ్చారన్న రేవంత్ రెడ్డి... పవన్ కల్యాణ్ సెల్ఫీ ఇవ్వలేదని నన్ను తిడితే ఎలా? అంటూ సెటైర్లు వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malkajgiri mp  revanth reddy  huzurnagar by poll  congress. TRS  Telangana  Politics  

Other Articles