MP Revanth Reddy slams the TRS government బంగారు తెలంగాణలో కుక్క చచ్చినా కేసు: రేవంత్ రెడ్డి

Kcr govt worried about dog than people mp revanth reddy

Revanth reddy on Bangaru Telangana, Revanth Reddy on husky death, Revanth Reddy on TRS Government, Revanth Reddy on KCR, Revanth Reddy on viral fever, Revanth Reddy, Husky, doctor Ranjith, pragati Bhavan, Lakshmi, Police case, bangaru telangana, Telangana, Politics

Congress MP Revanth Reddy slammed the TRS government and stated that KCR government is more worried about the dog at Pragathi Bhavan than people of Telangana.

బంగారు తెలంగాణలో కుక్క చచ్చినా కేసు: రేవంత్ రెడ్డి

Posted: 09/14/2019 02:23 PM IST
Kcr govt worried about dog than people mp revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లో హస్కీ అనే 11 నెలల శునకం మరణానికి కారణమయ్యారంటూ వైద్యుడితో పాటు అసుపత్రి నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవడంపై యావత్ తెలంగాణ విస్తుపోయిందంటూ కాంగ్రస్ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శునకానికి జ్వరం వచ్చి మరణిస్తే వైద్యులపై కేసు నమోదు చేయడం పట్ల ఆయన తనదైన శైలిలో వెటకారంగా స్పందించారు.

మాట మాట్లాడితే తాను తెలంగాణ ప్రజల పక్షానే వున్నానని, వారి కోసమే అలోచిస్తాననే ముఖ్యమంత్రి తన ప్రగతి భవన్ లో శునకానికి ఇచ్చిన విలువను బంగారు తెలంగాణలో ప్రజలకు ఇవ్వడం లేదన్న సత్యాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. డెంగ్యూ, ఫ్లూ, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా సహా పలు రకాల వైరల్ జ్వరాలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఆయన తనదైన శైలిలో సెటూర్ వేశారు.

ఓ వైపు ప్రజలు రోగాలతో, రోష్టులతో అల్లాడుతుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కుక్క చనిపోతే మాత్రం పోలీస్ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ కూడా బంగారు తెలంగాణలో మనుషులకు లేదా? అని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్న పత్రికల కథనాలను పోస్ట్ చేశారు. అలాగే తన ట్వీట్ కు తెలంగాణ సీఎం కార్యాలయం, రాష్ట్ర ఆరోగ్య శాఖలను ట్యాగ్ చేశారు.

అంతకుముందు నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటామని పేర్కొన్న ఆయన.. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. సురభి నాటకాలు కట్టిపెట్టి తొలుత  యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సూచిస్తూ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Husky  doctor Ranjith  pragati Bhavan  Lakshmi  Police case  bangaru telangana  Telangana  Politics  

Other Articles