fake currency notes racket in police trap పోలీసుల వలయంలో చిక్కుకున్న నకిలీ కరెన్సీ ముఠా..

Fake currency notes racket in police trap in nellore

fake currency in nellore, fake currency notes racket in nellore, fake notes racket in police trap, murali krishna fake currency notes, fake currency, murali krishna, fake notes racket, fake currency notes, fake indian currency notes, high quality fake notes, Nellore, Andhra Pradesh, Crime

!0 member Fake currency racket is trapped by police after the local small merchants complained about the issue. Murali Krishna the prime accused in the case is on bail in the same case and repeating the same crime.

పోలీసుల వలయంలో చిక్కుకున్న నకిలీ కరెన్సీ ముఠా..

Posted: 09/06/2019 06:36 PM IST
Fake currency notes racket in police trap in nellore

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నకిలీ నోట్లను ముద్రించి చెలామణి రాకెట్ ను పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాణ్యతతో కూడిన హై క్వాలిటీ నకిలీ నోట్లను ముద్రిస్తూ.. సాధారణ వీధి వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు బురిడీ కొట్టించి మరీ అసలు డబ్బును సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నకిలీ నోట్లు సుమారు రూ.39 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో నలుగురు బృంద సభ్యులను ఈ నెల 5న అరెస్టు చేయగా, మరో 5గురుని అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు.

కాగా ముఠాలోని ప్రధాన నిందితుడైన మురళీకృష్ణ గతంలోనే నకిలీ నోట్లను చలామణీ కేసులో అరెస్టయ్యాడు. ప్రస్తుతం బెయిల్ పై విడుదలై మరోసారి తిరిగి అదే దందా ప్రారంభించడం గమనార్హం. జైల్లో పరిచయమైన సహ ఖైదీలతో కలసి చేస్తున్నాడా.? లేక అతనే ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నాడా.? అన్న విషయాన్ని పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాలోని నిందితులు గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒక నిందితుడు మాత్రం రాజస్థాన్ కు చెందినవాడని తెలిపారు.

వీరంతా కలిసి నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్నారు. పలువురు వ్యాపారుల నుంచి నకిలీ నోట్లకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు పథకం ప్రకారం వీరిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరి నుంచి నకిలీ ముద్రణ యంత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో గత కొన్ని నెలలుగా, చిన్న, చిన్న దుకాణాలు, మందుల కొనుగోళ్లు, శీతలపానీయాల దుకాణాల వ్యాపారులు తమకు నకిలీ నోట్ల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్నారు. అయితే పోలీసులు నకిలీ నోట్ల ముఠాల ఆట కట్టించడంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles